Site icon HashtagU Telugu

Drones : డ్రోన్ హ‌బ్ గా భార‌త్‌: ప్ర‌ధాని మోడీ

Modi

Modi

డ్రోన్ హబ్ గా అవతరించే శక్తి భారత్ కు ఉందని ప్రధాని మోదీ వెల్ల‌డించారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ కార్యక్రమం ‘భారత్ డ్రోన్ మహోత్సవ్’ను ఢిల్లీలో ప్రధాని ప్రారంభించి ప్ర‌సంగించారు. స్మార్ట్ టెక్నాలజీ సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆశాభావాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. డ్రోన్ టెక్నాలజీ పట్ల దేశంలో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతమని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే డ్రోన్ రంగం అతిపెద్దదిగా అవతరించి, భారీగా ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందన్న అంచ‌నాకు వ‌చ్చారు మోడీ.

 

2026 నాటికి డ్రోన్ పరిశ్రమ రూ.15,000 కోట్లకు చేరుకుంటుందని, దేశంలో 270 డ్రోన్ స్టార్టప్ లు ఉన్నట్టు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్ల‌డించారు. డ్రోన్ తయారీ స్టార్టప్ లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. గత ప్రభుత్వాల కాలంలో టెక్నాలజీని పేదలకు వ్యతిరేకమని చూపించే ప్రయత్నాలు జరిగాయ‌ని ఆరోపించారు. అందుకనే 2014కు ముందు పాలనలో టెక్నాలజీ వినియోగం పట్ల ఉదాసీన వాతావరణం నెలకొంది. పేదలు మరింత కష్టాలు పడ్డారు. మధ్య తరగతి వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు’’ అని ప్రధాని చెప్పారు.

Exit mobile version