Site icon HashtagU Telugu

Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Nobel Peace Prize

Nobel Peace Prize

Nobel Peace Prize: భారత్-పాకిస్తాన్ మధ్య పోరాటాన్ని ఆపడంలో తన పాత్ర గురించి పదేపదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ఈ ఘర్షణను ఆపినందుకు గాను నోబెల్ బహుమతి (Nobel Peace Prize) పొందాలని ట్రంప్ ఆశపడ్డారు. కానీ భారత్ ట్రంప్‌ను ఈ బహుమతికి నామినేట్ చేయడానికి నిరాకరించింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. జూన్ 17న ప్రధాని మోదీతో ట్రంప్ ఈ విషయం గురించి చర్చించారు. ఈ వివాదాన్ని ఆపడంలో తన పాత్ర ఉందని పేర్కొని, నోబెల్ బహుమతికి తనను నామినేట్ చేయాలని ట్రంప్ మోదీని కోరారు.

భారత్ ఎందుకు నామినేట్ చేయలేదు?

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ప్రెసిడెంట్ ట్రంప్ మోదీ నుండి ఆశించేది రాజకీయంగా అసంబద్ధమైనది. ఒక బలహీన దేశంతో యుద్ధ విరమణ కోసం అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ తలవంచారని భావిస్తే దేశంలో దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ కఠినమైన వైఖరి ఆయన ఇమేజ్‌కు చాలా ముఖ్యం. ఈ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్ర ఉందని అంగీకరించడం, వారిని నోబెల్ బహుమతికి నామినేట్ చేయడం అంటే లొంగిపోయినట్లేనని భారత్ భావించింది.

Also Read: Narendra Modi : జపాన్ ప్రధానికి ఏపీకి చెందిన గిఫ్ట్ ఇచ్చిన మోదీ

పాకిస్తాన్ నామినేట్ చేసింది

కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికాలో డిన్నర్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత కూడా మునీర్ అమెరికాను సందర్శించారు. పాకిస్తాన్‌పై అమెరికా కృపకు కారణం, పాకిస్తాన్ అధ్యక్షుడు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడమేనని తెలుస్తోంది.

జూన్ 17న చివరి సంభాషణ

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ప్రధాని మోదీ- ట్రంప్ మధ్య జూన్ 17న చివరిసారిగా సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ట్రంప్ భారత్-పాక్ వివాదం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ తనను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తోందని, భారత్ కూడా అలా చేయాలని ట్రంప్ కోరారు. దీంతో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య వివాదంలో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని మోదీ స్పష్టం చేశారు. ఆ తర్వాత మోదీ, ట్రంప్ మధ్య సంభాషణ జరగలేదని నివేదిక పేర్కొంది.