ముంబై: చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోతున్నాయి. బడా కంపెనీలు భారీగా జాబ్ కట్స్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా భారత్ రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు ఫలిస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోకుండా తీసుకున్న నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 4.532 బిలియన్ డాలర్లు పెరిగి 584.248 బిలియన్ డాలర్ల నుంచి 588.78 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో విదేశీ మారక నిల్వలు (Forex Reserves) 2.16 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఈవివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
ALSO READ : Bankruptcy: దివాళా అంచున పాకిస్తాన్.. లగ్జరీ కార్ల వేలానికి సిద్ధం!
2021 అక్టోబర్ లో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి
2021 అక్టోబర్ లో భారత దేశం వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు (Forex Reserves) ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అయిన 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశం వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్, డాలర్ వంటి యూనిట్ల విలువలలో చోటుచేసుకునే హెచ్చుతగ్గుల ఆధారంగా విదేశీ మారక నిల్వలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇండియా ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDR) 35 మిలియన్ డాలర్లు పెరిగి 18.466 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. IMF వద్ద మన దేశం యొక్క రిజర్వ్ స్థానం.. ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో 4 మిలియన్ డాలర్లు తగ్గి 5.172 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక విదేశీ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ బలహీనతను ట్రాక్ చేస్తూ, రేంజ్-బౌండ్ ట్రేడ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 2 పైసలు పెరిగి రూ.81.78 వద్ద స్థిరపడింది.