Canada : 2021 జాతీయ ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకోలేదు: కెన‌డా

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 01:16 PM IST

Canada: కెన‌డా(Canada) ఎన్నిక‌ల్లో భార‌త్(India) జోక్యం చేసుకోలేద‌ని, ప్ర‌ధాని జ‌స్టిస్ ట్రూడో(Justice Trudeau) విజ‌యంలో ఆ దేశ పాత్ర ఏమీ లేద‌ని కెన‌డా విచార‌ణాధికారులు(Canadian investigators) వెల్ల‌డించారు. 2021లో జ‌రిగిన జాతీయ ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకోలేద‌ని గుర్తించామ‌ని కెన‌డా సీనియ‌ర్ అధికారుల బృందం పేర్కొన్న‌ది. అయితే గ‌త రెండు ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకున్న‌ట్లు గుర్తించామ‌ని కెన‌డా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. 2019, 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు జోక్యం చేసుకున్న‌ట్లు కొన్ని రోజుల క్రితం కెన‌డా సెక్యూటీ ఇంటెలిజెన్స్ స‌ర్వీస్ ఆరోప‌ణ చేసింది. ఆ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తాజాగా కెన‌డా ప్ర‌భుత్వం స్పందించింది.

We’re now on WhatsApp. Click to Join.

రెండు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌స్టిన్ ట్రూడోకు చెందిన లిబ‌ర‌ల్ పార్టీ విజ‌యం సాధించింది. చైనా పాత్ర ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో వ‌త్తిడిలో ఉన్న ట్రూడో ఆ అంశంపై విచార‌ణ‌కు ఆదేశించింది. విచార‌ణ ప్యానెల్ ముందు ఇవాళ ట్రూడో కూడా హాజ‌రుకానున్నారు. కెన‌డా ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకున్న‌ట్లు గ‌తంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఇండియా కొట్టిపారేసింది. ఇత‌ర ప్ర‌జాస్వామ్య దేశాల వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోబోమ‌ని భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ర‌ణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.

Read Also: Ramesh Kumar Reddy : వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే..