Site icon HashtagU Telugu

Kamikaze Drones : భారత్ అమ్ములపొదిలో స్వదేశీ కామికాజి డ్రోన్లు.. ఏమిటివి ?

India Kamikaze Drones

Kamikaze Drones :  స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన కామికాజి డ్రోన్‌ను భారత్ తాజాగా ఆవిష్కరించింది. ఈ సూసైడ్ డ్రోన్‌ను నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబొరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) తయారు చేసింది. ఇది వెయ్యి కిలోమీటర్ల దాకా ఎలాంటి ఆటంకం లేకుండా ఏకధాటిగా ఎగరగలదు. ఈక్రమంలో గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. జీపీఎస్ అనేది అమెరికా టెక్నాలజీ. ఒకవేళ ‘జీపీఎస్‌’ పని చేయకున్నా మన స్వదేశీ కామికాజి డ్రోన్‌కు ఇబ్బందేం ఉండదు. ఎందుకంటే ఇందులో మన దేశం సొంతంగా తయారుచేసిన ‘నావిక్‌’ నేవిగేషన్ టెక్నాలజీ ఉంది. దాని ద్వారా అది శత్రు లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. తన జర్నీలో ఇతర దేశాల రాడార్ల కళ్లుకప్పుతూ ముందుకు వెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఈ డ్రోన్‌లో 30 హార్స్‌ పవర్‌ వాంకెల్‌ ఇంజిన్‌‌ను వాడారు. 120 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్ తనతో పాటు 25 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. మన స్వదేశీ కామికాజి డ్రోన్ పొడవు 2.8 మీటర్లు, రెక్కల పొడవు 3.5 మీటర్లు ఉంటుంది. ఎగురుతుండగా ఆర్మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. అనుమతి లభించగానే అది తన లక్ష్యంపైకి దూసుకెళ్లి తనను తాను పేల్చుకుంటుంది.

We’re now on WhatsApp. Click to Join

‘కామికాజి’ అంటే ఏమిటి ? 

‘కామికాజి’(Kamikaze Drones) అనేది జపాన్ పదం. రెండో ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటన్, దాని మిత్రదేశాల యుద్దనౌకలపై దాడులు చేసేందుకు  జపాన్ వినియోగించిన యుద్ధ విమానాల పైలట్లను కామికాజి ఆత్మాహుతి దళాలు అని పిలిచేవారు. వీరు తమ యుద్ధ విమానాల నుంచి బాంబులు వేసి తిరిగి రావటానికి బదులు, ఆ బాంబులతో పాటు విమానాన్ని కూడా శత్రుదేశ లక్ష్యంపై పడేసుకొని ఆత్మాహుతి చేసుకుంటారు. దాదాపు 3800 మంది జపాన్‌ కామికాజి పైలట్లు అప్పుడు ఆత్మాహుతి దాడుల్లో పాల్గొన్నారు. ఈ తరహా డ్రోన్లను ఇరాన్ షహీద్‌ డ్రోన్లు అని పిలుస్తుంది. రష్యా వీటిని జెరాన్‌-2గా పిలుస్తోంది.

Also Read :Micro Plastics : ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్‌.. ప్రజారోగ్యంతో ఆటలు

రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాల్లో కామికాజి డ్రోన్లను పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా వినియోగిస్తున్న కామికాజి డ్రోన్లు అన్నీ ఇరాన్ సప్లై చేసినవే. ఇరాన్ పెద్దఎత్తున కామికాజి డ్రోన్లను తయారు చేసి ఉత్తర కొరియా, రష్యా లాంటి చాలా దేశాలకు సప్లై చేస్తోంది. రష్యా దగ్గర భారీ క్రూయిజ్  క్షిపణులు చాలానే ఉన్నాయి. అయితే ఒక్కో క్రూయిజ్ క్షిపణి తయారీకి దాదాపు రూ.8  కోట్లకుపైనే ఖర్చవుతుంది. కానీ కామికాజి డ్రోన్ తయారీకి రూ.16 లక్షలే ఖర్చవుతుంది. అందుకే ఇరాన్ నుంచి వాటిని పెద్దసంఖ్యలో రష్యా సప్లై చేసుకుంటోంది.  శత్రు లక్ష్యాలను ఛేదించే విషయంలో కామికాజి డ్రోన్లు కచ్చితత్వంతో పనిచేస్తాయి.

Also Read :Neeraj Chopra: జ‌ర్మ‌నీకి వెళ్లిన నీర‌జ్ చోప్రా.. ఈ స‌మ‌స్యే కార‌ణ‌మా..?