Water Attack : పాకిస్తాన్‌పై వాటర్ ఎటాక్‌ను భారత్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లను మూసేసింది. దీంతో పాకిస్తాన్ వైపుగా నీటి సరఫరా ఆగిపోయింది. ఈ ఆనకట్ట నుంచే పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు నీటి సరఫరా జరిగేది. భారత సర్కారు తీసుకున్న తాజా చర్య కారణంగా ఇకపై పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కరువు కేకలు వినిపించే అవకాశం ఉంటుంది. ‘‘పాకిస్తాన్ విషయంలో అవసరమైతే భారత్(Water Attack) మరిన్ని కఠిన చర్యలు తీసుకోగలదు. ఈవిషయం పాకిస్తాన్‌కు తెలియాలి. అందుకే బాగ్లిహార్ ఆనకట్ట గేట్లను మూసివేశాం. ఇది స్వల్పకాలిక చర్య మాత్రమే’’ అని అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
Also Read :Nuclear Warning: దాడి చేసినా.. నీళ్లు ఆపినా.. అణుబాంబులు వేస్తాం : పాక్
బాగ్లిహార్ డ్యామ్‌పై భారత్‌కు పవర్ ప్రాజెక్టు
భారత్ – పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం ద్వారా పాకిస్తాన్‌కు అత్యధిక జల వాటా లభించేది చీనాబ్ నదిలోనే. ఈ నదీజలాలు ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతానికి చేరుతుంటాయి. దీనివల్ల అక్కడ వ్యవసాయం జోరుగా సాగుతుంటుంది. ఒకవేళ చీనాబ్ నదిపై ఉన్న ఆనకట్టల గేట్లను భారత్ మూసేస్తే.. పాకిస్తాన్‌లోని పంజాబ్ కరువును చూడాల్సి వస్తుంది. బాగ్లిహార్ డ్యామ్ వద్ద బాగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును భారత్ 2008లో నిర్మించింది. దీని సామర్థ్యం 900 మెగావాట్లు. ఇది జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో చీనాబ్ నదిపై ఉంది.
Also Read :World Traveler Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు.. ఏం చేశాడంటే..
బాగ్లిహార్ డ్యామ్‌పై పాక్‌కు 6 అభ్యంతరాలు
చీనాబ్ నదిపై బాగ్లిహార్ డ్యామ్ నిర్మాణ పనులు 1999లో ప్రారంభమయ్యాయి. ఈ పనులు 2016 నాటికి పూర్తయ్యాయి. ఈ డ్యామ్ నిర్మాణాన్ని మొదటి నుంచే పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ వస్తోంది. బాగ్లిహార్ డ్యామ్‌లో స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లు ఉండటాన్ని ఆనాడు పాక్ వ్యతిరేకించింది. మొత్తం 6 అభ్యంతరాలతో ప్రపంచ బ్యాంకును ఆపాడు పాకిస్తాన్ ఆశ్రయించింది. అయితే బాగ్లిహార్ డ్యామ్‌లో స్లూయిస్ స్పిల్‌వే ఉండటాన్ని వరల్డ్ బ్యాంకు సమర్ధించింది. భారత్ తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. నిర్మాణపరమైన సాంకేతికతలో భాగంగానే స్లూయిస్ స్పిల్‌వేలను బాగ్లిహార్ డ్యామ్‌లో ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది.