India Vs China : ఈరోజు భారత్, చైనాలకు స్పెషల్‌గా మారనుంది. ఇవాళ బార్డర్‌లో ఇరుదేశాల సైనికులు స్వీట్లు పరస్పరం పంచుకోనున్నారు. ఎందుకంటే భారత్, చైనాలు ముందస్తుగా అనుకున్న ప్రకారం అక్టోబరు నెలాఖరులోగా తూర్పు లడఖ్‌లోని డెప్సాంగ్, డెంచాక్ ఏరియాల నుంచి తమతమ సైనిక దళాలను(India Vs China) ఉపసంహరించుకున్నాయి. ఆర్మీలను వెనక్కి పిలుచుకోవడంతో పాటు ఆయా ఏరియాల్లో నిర్మించిన సైనిక మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా తొలగించాయి.
Also Read :Diwali 2024: ఈ ఆలయం దీపావళి నాడు మాత్రమే తెరవబడుతుంది..!
ఇక 2020 ఏప్రిల్‌కు మునుపటి సరిహద్దు పొజిషన్లలో ఇరుదేశాల సైన్యాలు పెట్రోలింగ్‌ను ప్రారంభించనున్నాయి. ఈ దౌత్య విజయాన్ని ఇరుదేశాలు సాధించినందుకు గుర్తుగా ఇవాళ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికులు స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకోనున్నారు. ఇటీవలే బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజన్ వేదికగా సమావేశమైన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ దీనికి దౌత్య పరిష్కారాన్ని సాధించడంలో సఫలమయ్యారు. ఈ దౌత్య విజయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాత్ర చాలా కీలకమైంది అని చెప్పొచ్చు.
Also Read :Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు
డెప్సాంగ్, డెంచాక్‌ల నుంచి చైనా దళాలు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి సాక్ష్యంగా నిలిచే పలు శాటిలైట్ ఫొటోలు తాజాగా బయటికి వచ్చాయి. అక్టోబరు 11న డెప్సాంగ్ ఏరియాలో నాలుగు వాహనాలు, రెండు గుడారాలు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలలో కనిపించాయి. అక్టోబరు 25న తీసిన శాటిలైట్ ఫొటోలలో చైనా టెంట్లు కనిపించలేదు. వాహనాల కదలికలు కనిపించలేదు. డెంచాక్ నుంచి సెమీ-పర్మనెంట్ చైనీస్ నిర్మాణాలు తొలగిస్తున్నట్లుగా మరొక శాటిలైట్ ఫొటో ఇటీవలే బయటికి వచ్చింది. 2020 మే నెలలో భారత్, చైనా సైన్యాల మధ్య సరిహద్దుల్లో ప్రతిష్టంభన మొదలైంది. అయితే 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు కూడా చనిపోయారు. అయితే ఎంతమంది అనే విషయం తెలియరాలేదు.