Site icon HashtagU Telugu

Amartya Sen: అతి పెద్ద సంక్షోభంలో భార‌త్‌ : అమర్త్యసేన్

amratya sen

amratya sen

భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ‘జాతి పతనం` అంటూ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆందోళ‌న చెందారు. ఐక్యతను కాపాడేందుకు ప్రజలు కృషి చేయాలని కోరారు. మత ప్రాతిపదికన విభజనలు చేయరాదని అన్నారు. అమర్త్య పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో, ప్రముఖ ఆర్థికవేత్త భార‌త్ లోని ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న చెందారు. “నేను దేనికైనా భయపడుతున్నానా అని ఎవరైనా నన్ను అడిగితే, నేను అవును అని చెబుతాను. ఇప్పుడు భయపడడానికి కారణం ఉంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు భయాందోళనకు గురిచేస్తున్నాయి.“దేశం ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చారిత్రాత్మకంగా ఉదారవాదంగా ఉన్న దేశంలో విభజనను నేను కోరుకోవడం లేదు. కలిసికట్టుగా పని చేయాలి’’ అని అన్నారు.

భారతదేశం హిందువులకు లేదా ముస్లింలకు మాత్రమే చెందిన‌ది కాద‌ని నొక్కిచెప్పిన ఆయ‌న దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.“భారతదేశం హిందువుల దేశం మాత్రమే కాదు. ముస్లింలు మాత్రమే భారతదేశాన్ని తయారు చేయలేరు. అందరూ కలిసి పని చేయాలి” అని సేన్ అన్నారు.