Site icon HashtagU Telugu

Canada-India : విభేదాల నుంచి విప్లవానికి.. భారత్–కెనడా మధ్య తిరిగి స్నేహ యాత్ర

Canada

Canada

Canada-India : కెనడా తాజా రాజకీయ పరిణామాలు భారత్‌తో సంబంధాలపై స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయి. గతంలో ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఇచ్చిన ప్రోత్సాహం భారత–కెనడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై ఆరోపణలు చేసి ట్రూడో తన రాజకీయ ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను పణంగా పెట్టారు. అయితే తాజాగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ, భారతంతో ఉన్న సంబంధాలను మెరుగుపర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంకేతంగా జీ–7 సమ్మేళనానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన కెనడా, సంబంధాల పునరుద్ధరణకు తలుపులు తెరిచింది. స్వయంగా ప్రధాని కార్నీ మోదీకి ఫోన్ చేసి ఆహ్వానం అందజేశారు.

CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు

భారత్–కెనడా సంబంధాల్లో మళ్లీ ఉష్ణత తీసుకురావడానికి మరో కీలక అడుగు ముందుకు పడింది. అంతర్జాతీయ నేరాలు, ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు రెండు దేశాలు ఓ ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇది ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం వెలుబడాల్సి ఉంది కానీ, దీని ప్రాధాన్యత అమోఘంగా ఉందని విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి.

కెనడా, ముఖ్యంగా ట్రూడో హయాంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు అడ్డుగా మారిందన్న అభిప్రాయం భారత్‌ వర్గాల్లో ఉంది. నిందితులు, మాఫియా గ్యాంగులు, తీవ్రవాద గ్రూపులు కెనడా నుంచే కార్యకలాపాలను నడిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తాజా ఒప్పందం కుదరడం, భారత్‌కు దౌత్యపరంగా కీలక విజయం అనే చెప్పాలి. ఇది కెనడా వేదికగా భారత్‌లో నేరపూరిత కార్యకలాపాలు నడుపుతున్నవారిపై చర్యలకు దారితీయవచ్చు.

2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్–కెనడా సంబంధాలు తీవ్రమయ్యాయి. ఈ హత్యపై ట్రూడో భారత్‌పై నేరుగా ఆరోపణలు చేయడం తీవ్ర దౌత్య సంక్షోభానికి దారితీసింది. భారత్ ఈ ఆరోపణలను నిరాకరించడమే కాకుండా, అవి రాజకీయ ప్రేరణతో కూడినవని పేర్కొంది. తదనంతరం రెండు దేశాలు పరస్పరం తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మారుతున్న కెనడియన్ వైఖరి భారత్‌కు అనుకూల వాతావరణాన్ని అందించనుంది. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక సహకారం పునరుజ్జీవించడానికి ఇది సరైన వేళగా భావిస్తున్నారు.

Anirudh Ravichander: త్వ‌రలో SRH ఓన‌ర్ కావ్య మార‌న్‌ను పెళ్లి చేసుకోబోతున్న అనిరుధ్‌?