Fourth Largest Economy: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌ను భారత్ ఐదో స్థానంలోకి నెట్టేసింది. ఈవిషయాన్ని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ వైపుగా ఇది అతిపెద్ద ముందడుగు అని ఆయన చెప్పాు. భారత్‌కు ఈ ఘన విజయాన్ని(Fourth Largest Economy) సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read :Dogs Vs Cancer : కుక్కలు క్యాన్సర్‌ను కూడా పసిగడతాయ్.. ఎలాగో తెలుసా ?
టాప్ – 10 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలివీ..
- ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ -10 ఆర్థిక వ్యవస్థల్లో నంబర్ 1 స్థానంలో అమెరికా ఉంది. జీడీపీ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. అమెరికా జీడీపీ విలువ 30.507 ట్రిలియన్ డాలర్లు. 20వ శతాబ్దం నుంచి అమెరికాయే ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉంది. రాబోయే సంవత్సరాల్లో అమెరికాను చైనా అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- నంబర్ 2 స్థానంలో భారత్ పొరుగుదేశం చైనా ఉంది. దీని జీడీపీ విలువ 19.231 ట్రిలియన్ డాలర్లు.
- నంబర్ 3 స్థానంలో భారత్ మిత్రదేశం జర్మనీ ఉంది. దీని జీడీపీ విలువ 4.744 ట్రిలియన్ డాలర్లు.
- నంబర్ 4 స్థానంలో భారత్ ఉంది. దీని జీడీపీ విలువ 4.187 ట్రిలియన్ డాలర్లు ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే జర్మనీ దేశాన్ని భారత ఆర్థిక వ్యవస్థ దాటేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జర్మనీ జీడీపీ విలువకు అతికొద్ది దూరంలోనే భారత్ నిలిచి ఉంది.
- నంబర్ 5 స్థానంలో జపాన్ ఉంది. దీని జీడీపీ విలువ 4.186 ట్రిలియన్ డాలర్లు. భవిష్యత్తులో ఇది కూడా భారత్, జర్మనీలతో పోటీ పడే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాంకులు జపాన్‌లో ఉన్నాయి. భారత్‌లోని రిలయన్స్, అదానీ లాంటి దిగ్గజ కంపెనీలకు కూడా జపాన్ బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. బుల్లెట్ ట్రైన్ లాంటి మెగా ప్రాజెక్టుల కోసం జపాన్ నుంచే భారత్ అప్పులు తీసుకుంటుంది.
- నంబర్ 6 స్థానంలో తెల్లదొరల దేశం బ్రిటన్ (యూకే) ఉంది. దీని జీడీపీ విలువ 3.839 ట్రిలియన్ డాలర్లు.
- నంబర్ 7 స్థానంలో భారత్ మిత్రదేశం ఫ్రాన్స్ ఉంది. దీని జీడీపీ విలువ 3.211 ట్రిలియన్ డాలర్లు.
- నంబర్ 8 స్థానంలో భారత్ మిత్రదేశం ఇటలీ ఉంది. దీని జీడీపీ విలువ 2.422 ట్రిలియన్ డాలర్లు.
- నంబర్ 9 స్థానంలో కెనడా ఉంది. దీని జీడీపీ విలువ 2.225 ట్రిలియన్ డాలర్లు.
- నంబర్ 10 స్థానంలో బ్రెజిల్ ఉంది. దీని జీడీపీ విలువ 2.125 ట్రిలియన్ డాలర్లు.