Rice Export: మోడీ కీలక నిర్ణయం.. నేపాల్ కు భారత్ అండ

పొరుగు దేశం నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా చాలా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మానవతాదృక్పదంతో నేపాల్‌కు సహాయం చేయాలని నిర్ణయించింది.

Rice Export: పొరుగు దేశం నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా చాలా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మానవతాదృక్పదంతో నేపాల్‌కు సహాయం చేయాలని నిర్ణయించింది. నేపాల్‌లో భూకంప బాధితులకు విరాళంగా 20 మెట్రిక్ టన్నుల తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం పతంజలి ఆయుర్వేదానికి అనుమతినిచ్చింది.

నవంబర్ 6న నేపాల్‌లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 152 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం సంభవించిన వెంటనే నేపాల్‌కు సహాయక సామగ్రిని అందించిన మొదటి దేశం భారతదేశం. కాగా బియ్యం సరఫరాలో కొరతను నివారించేందుకు భారత ప్రభుత్వం జూలై 20 నుంచి తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని దేశాలకు వారి ఆహార భద్రత అవసరాలను మరియు అభ్యర్థన మేరకు ఎగుమతికి అనుమతిస్తుంది. ఈ మేరకు ఇవాళ డీజీఎఫ్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది

పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు భూకంప బాధితుల కోసం నేపాల్‌కు విరాళంగా 20 మెట్రిక్ టన్నుల తెల్ల బియ్యం ఎగుమతి నిషేధం నుండి మినహాయించింది. దీనికి ముందు భారతదేశం మరో ఏడు దేశాలకు కూడా సరఫరా చేసింది. గత నెల అక్టోబర్‌లో విడుదల చేసిన డీజీఎఫ్టీ (DGFT) నోటిఫికేషన్ ప్రకారం నేపాల్, కామెరూన్ మరియు మలేషియాతో సహా ఏడు దేశాలకు 10,34,800 టన్నుల తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించింది.

గత నెలలో భారత ప్రభుత్వం నేపాల్, కామెరూన్ (1,90,000 టన్నులు), కోట్ డి ఐవరీ (1,42,000 టన్నులు), గినియా (1,42,000 టన్నులు), మలేషియా (1,70,000 టన్నులు), ఫిలిప్పీన్స్ (2)లకు 95,000 టన్నులు పంపింది.

Also Read: AP News: టీడీపీ నేతపై వైసీపీ దాడి.. నారా లోకేష్ గరం