ఈసారి మోదీని(Modi) ఎదుర్కునేందుకు దేశంలోని దాదాపు 28 పార్టీలు కలిసి పోరాడుతున్నాయి. 28 పార్టీలు కలిసి ఇండియా(INDIA Alliance) అని పేరు పెట్టుకున్నా వారిలో ఐక్యత మాత్రం లోపిస్తుంది. ఇప్పటికే పాట్నా, బెంగుళూరు కేంద్రంగా ఈ పార్టీల సమావేశాలు జరిగాయి. మూడో సమావేశం నేడు ముంబాయ్(Mumbai) లో ముగిసింది. ముంబాయ్ లో జరిగిన సమావేశంలో 13 మందితో కూడిన కమిటీని వేస్తూ తీర్మానం చేసింది. ఉమ్మడి ప్రణాళికను రచించడానికి ఆ కమిటీ కసర్తత్తు చేస్తోంది. అయితే, కూటమి కన్వీనర్, కో కన్వీనర్ ఇతరత్రా పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అసలు ఈ కూటమి ప్రధాని అభ్యర్థి కూడా ఎవరో ఇప్పటికి ఖరారు కాలేదు. ఇందులో ఉన్న టాప్ లీడర్లు మాత్రం ఎవరికీ వారే ప్రధాని అభ్యర్థి అని అనుకుంటున్నారు.
ప్రస్తుతానికి 13మందితో కూడిన కమిటీకి కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేసే బాధ్యతను అప్పగించింది. 13 మందితో ఇండియా కూటమి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ సమన్వయ కూటమిలో 13 మంది ఎవరు ఏ పార్టీ నుంచి ఉన్నారంటే..
కేసి వేణుగోపాల్ (కాంగ్రెస్)
శరద్ పవార్(ఎన్సీపీ)
ఎంకే స్టాలిన్(డీఎంకే)
సంజయ్ రౌత్(శివసేన)
తేజస్వి యాదవ్(ఆర్జేడీ)
రాఘవ్ చద్దా(ఆప్)
అభిషేక్ బెనర్జీ(టీఎంసీ)
జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ)
లలన్ సింగ్ (జేడీయూ)
హేమంత్ సొరేన్(జెఎంఎం)
డి రాజా(సీపీఐ)
ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్)
మెహబూబా ముప్తి (పీడీపీ) లు ఉన్నారు.
ఈ 13 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఈ 13 మంది మోదీని ఓడించడానికి ఎలాంటి ప్రణాళికలు వేస్తారో, అవి ఫలిస్తాయో లేదో చూడాలి.
Also Read : INDIA Meeting : కన్వీనర్ ను తేల్చలేని ఇండియా! ఉమ్మడి కార్యాచరణకు కమిటీ!!