Site icon HashtagU Telugu

India Alerts: ర‌ష్యా, ఉక్రెయిన్ ల్లోని భార‌తీయుల‌కు అలర్ట్‌!

Russia

Russia

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్ని యుద్ధ వాతావ‌ర‌ణం భార‌త్ కు తాకింది. ఆయా దేశాల్లో ఉండే భారతీయులు తిరిగి దేశానికి రావాల‌ని తెలియచేసింది. భారతీయ విద్యార్థులు వెంట‌నే స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌ని సూచించింది. ఉక్రెయిన్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీతో టచ్‌లో ఉండాలని కోరింది. ఉక్రెయిన్ రాయబార కార్యాలయ కార్యకలాపాలను రాజధాని కైవ్ నుంచి మ‌ర్చేశార‌నే విష‌యాన్ని కూడా తెలిపింది. ఆ దేశంలోని ఎల్వివ్‌కు మారుస్తున్నట్లు ఉక్రెయిన్‌ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్ల‌డించాడు. ఉక్రెయిన్‌తో రష్యా సరిహద్దు వ‌ద్ద ఉన్న బెలారస్‌లో 100,000 కంటే ఎక్కువ మంది సైనికులను మాస్కో మోహ‌రించింది. కైవ్‌తో సహా ఎప్పుడైనా విధ్వంసక దాడిని ప్రారంభించవచ్చని అమెరికా హెచ్చ‌రించింది. రష్యా తన బలగాలు ఉక్రెయిన్‌పై దాడి చేసినట్లయితే “తీవ్ర పరిణామాల‌పై అమెరికా హెచ్చరించింది. సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం కోసం పట్టుబట్టింది.”సంక్షోభాన్ని తగ్గించడానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రష్యా మరియు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో), పాశ్చాత్య శక్తుల మధ్య ఉక్రెయిన్ ఉంది.

రష్యా డిమాండ్లు ఏమిటి?