పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ (India) తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ (Pak) ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ముఖ్యంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం యుద్ధానికి సమానమని, ఇది నీటి యుద్ధం అని పాక్ పేర్కొంది. ఇలా పాక్ “మేకపోతు గాంభీర్యం” ప్రదర్శిస్తుంది కానీ లోలోపల మాత్రం తప్పు చేశామని ఆలోచనలో ఉంది.
Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్
ఇక ఆర్థికంగా పాక్‌పై భారత్ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ స్టాక్‌మార్కెట్ KSE-100 ఇండెక్స్ ఒక్కసారిగా 2,400 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో ట్రేడింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో పాక్ అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షలు చేస్తున్నామని ప్రకటించగా, ఇండియన్ నేవీ కూడా INS సూరత్ నుంచి మీడియం రేంజ్ మిసైల్‌ను పరీక్షించి బలాన్ని చాటిచెప్పింది. ఇది సీ స్కిమ్మింగ్ టార్గెట్స్‌ను సమర్థంగా ఎదుర్కోగలదని నేవీ వెల్లడించింది. ఇదే సమయంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది.
Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. పాకిస్తానీ భామలకు షాక్
ఇటు కేంద్రం దేశవ్యాప్తంగా ఉగ్రదాడులపై చర్యలు తీసుకోవడంలో వేగం పెంచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, భద్రతా పరిస్థితులపై చర్చించారు. అలాగే అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకుంటోంది కేంద్రం. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. వారిని పట్టిస్తే రూ.20 లక్షల బహుమతి ప్రకటించడం ద్వారా కేంద్రం ఈ దాడిపై ఎంతటి కఠినంగా ఉందొ స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు మొత్తం భారత శక్తిని, సంకల్పాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు సిద్ధం అవుతుంది.