Space Docking : భారతీయులంతా గర్వించదగిన మరో అపూర్వ విజయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించి పెట్టింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ఇస్రో ఇటీవలే నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దీంతో ఈ ఘనతను సాధించిన నాలుగో దేశంగా భారత్(Space Docking) అవతరించింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను ఈవిధంగా అనుసంధానం చేయగలిగాయి. ఈవివరాలను ఎక్స్ వేదికగా ఇస్రో (ISRO) వెల్లడించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడం కోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది.
Also Read :Jobs In DCCBs : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి
స్పేస్ డాకింగ్ సక్సెస్ ఇలా..
- 2024 సంవత్సరం డిసెంబరు 30న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో సతీశ్ ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) ఉంది. దాని నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్‌ఎల్‌వీ) అనే రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది.
- ఈ రాకెట్ బయలుదేరిన 15.09 నిమిషాల తర్వాత.. దానిలోని రెండు శాటిలైట్లు విడిపోయాయి.
- అంతరిక్షంలో ఈ రెండు ఉపగ్రహాలు చక్కర్లు కొడుతుండగా.. వాటి వేగాన్ని ఇస్రో నియంత్రణలోకి తెచ్చుకుంది. మూడుసార్లు స్పేస్ డాకింగ్ (Docking) కోసం యత్నించింది. అయితే అది సాధ్యపడలేదు. దీంతో స్పేస్ డాకింగ్ ప్రక్రియను వాయిదా వేశారు.
- ఎట్టకేలకు గురువారం రోజు ఈ రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేసే ప్రక్రియ విజయవంతం అయింది. రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు.
- 3 మీటర్ల దూరంలో ఈ రెండు శాటిలైట్లను నిలకడగా నిలబెట్టి.. వాటి మధ్య స్పేస్ డాకింగ్ (Docking)ను చేయించారు. ఈ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది.
- అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోంది. 2023 సంవత్సరంలోనూ భారత్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. అప్పట్లో చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై స్పేస్ క్రాఫ్ట్ (వ్యోమనౌక)ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేయించింది. దాని ద్వారా చంద్రుడి ఉపరితలంపై భారత్ ముమ్మర అధ్యయనం చేసింది.
Also Read :Sankranti Cockfights : 3 రోజుల్లో రూ.1,500 కోట్ల కోడిపందేలు.. ఎంతోమంది ‘నష్ట’కష్టాలు
భారత్ ఫ్యూచర్ ప్లాన్ ఇదీ..
- 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపైకి పంపాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది.
- రాబోయే కొన్నేళ్లలో వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలని భారత్ భావిస్తోంది.
- 2035 నాటికి సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్‌తో భారత్ ఉంది.
- వీనస్ గ్రహంపై అధ్యయనం కోసం 2028లో భారత్ ప్రత్యేక మిషన్‌ను చేపట్టబోతోంది.
- చంద్రుడి ఉపరితలంపై భారత ల్యాండర్, రోవర్లు సేకరించిన శాంపిళ్లను భూమికి తీసుకొచ్చే ప్రక్రియ కోసం 2027లో మరో చంద్రయాన్ మిషన్‌ను చేపట్టనున్నారు.