జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam Attack)లో నిన్న జరిగిన ఉగ్రదాడి (Terror Attack) దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ దాడికి పాకిస్థాన్(Pakistan)కు సంబంధం ఉన్న ఉగ్రవాదులు బాధ్యత వహించారని భారత ప్రభుత్వం (Bharat ) భావిస్తోంది. దీంతో పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం మిలిటరీ, దౌత్యరంగాల్లో ప్రతీకార చర్యలు తీసుకునే యోచనలో ఉంది. ఇందులో భాగంగా పాక్ ఆర్మీకి చెందిన స్థావరాలు, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ కేంద్రాలపై టార్గెట్ దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పాకిస్థాన్‌తో ఉన్న ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్య సంబంధాలను తెంచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
Mike Hesson: పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్‌గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్?
మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా భారత్ పునఃపరిశీలించనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ దాడిలో పాకిస్థాన్ పాత్రను ప్రపంచానికి ఎత్తిచూపేందుకు భారత్ యుద్ధప్రాతిపదికన దౌత్య చర్యలు చేపట్టనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతినిధులతో పాటు 95 దేశాలకు పాకిస్థాన్ పాత్రను వివరించే ప్రయత్నం జరుగుతోంది. ఈ చర్యలన్నీ పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచేలా ఉండబోతున్నాయి.
ఇదిలా ఉంటె దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేయడం జరిగింది. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా అనే పేర్లతో గుర్తించారు. వీరు TRF అనే ఉగ్ర సంస్థకు చెందినవారిగా వెల్లడించారు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలువబడే బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన హీనచర్య ద్వారా 26 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. దాడి అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోవడంతో వారికోసం గాలింపు కొనసాగుతోంది.