Site icon HashtagU Telugu

Independence Day: అందరు స్వాతంత్య్ర వేడుకలు పగలు జరుపుకుంటే.. అక్కడ మాత్రం రాత్రి జరుపుకుంటారట?

Independence Day

Independence Day

మాములుగా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలు లోపు జరుపుకుంటూ ఉంటారు. భారతీయులు ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. స్కూల్స్ లో ఆఫీసులలో, పెద్దపెద్ద కర్మాగారాలలో పరిశ్రమలలో ఇలా అనేక ప్రాంతాలలో ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవం గురించి, స్వాతంత్రం రావడం కోసం నాయకులు పడిన కష్టాల గురించి మరోసారి స్మరించుకుంటూ ఉంటారు. స్కూల్స్ లో అయితే పిల్లలు భక్తి గీతాలు డాన్సులు ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు.

ఆ సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం సమయంలో పగలు సమయంలో జరిగితే ఒక ప్రదేశంలో ఉన్న ప్రజలు మాత్రం రాత్రి సమయంలో అనగా అర్ధరాత్రి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారట. దేశమంతా ఒకలా చేస్తే ఒక ఆ రాష్ట్రంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారు? పైగా వారికి అనాదిగా వస్తున్న సంప్రదాయమట. వారి పూర్వీకుల నుంచి ఇలానే చేస్తున్నారట. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది ఎందుకు అలా జరుపుకుంటారు అన్న వివరాల్లోకి వెళితే.. బిహార్‌ లోని పుర్నియా అనే ప్రాంతంలోని వాసులు మాత్రం అర్థరాత్రి 12.01 గంటల​కు జెండా చౌక్‌ అనే ప్రాంతంలో జెండా ఎగురవేసి సెలబ్రేట్‌ చేసుకుంటారు. అప్పటినుంచో మొదలుపెట్టిన ఈ ప్రక్రియను ఇప్పటికి అలాగే కొనసాగిస్తున్నారు.

వారంతా నాటి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు బ్రిటిష్‌ పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించింది. మనకు స్వాతంత్య్రం వచ్చింది అని ప్రకటించడం, రేడియోలకి అతుక్కుపోయి మరీ విన్నారు. ఆ తర్వాత వెంటనే పుర్నియా వాసి రామేశ్వరప్రసాద్‌ సింగ్‌, దాదాపు పదివేలమంది వ్యక్తులంత కలిసి ఇలా నెహ్రు ప్రకటించగానే అర్థరాత్రి ఆ క్షణమే జెండా ఎగరువేసి వారంతా సంబరాలు చేసుకున్నారు. దాంతో అప్పటి నుంచి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఈ వేడుకల్లో ఆటంకం ఎదురుకాలేదని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం అతని వారసులు దీన్నికొనసాగిస్తున్నట్లు చెప్పారు. రామేశ్వర ప్రసాద్‌ మరణాంతరం ఆయన కూతురు సురేఖ దీన్ని పాటించిందని, ఇప్పుడూ మనవడు విపుల్‌ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.