SBI Cards: అద్దె చెల్లింపుపై రుసుముల పెంపు: ఎస్‌బీఐ

క్రెడిట్‌ కార్డు (Credit Card) ఉపయోగించి అద్దె చెల్లించినప్పుడు వర్తించే రుసుమును పెంచుతున్నట్లు

క్రెడిట్‌ కార్డు (Credit Card) ఉపయోగించి అద్దె చెల్లించినప్పుడు వర్తించే రుసుమును పెంచుతున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ (SBI Cards) వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ ఛార్జీ రూ.99 (పన్నులు అదనం) గా ఉండగా, మార్చి 17 నుంచి రూ.199 (పన్నులు అదనం)కి పెంచుతున్నట్లు తెలిపింది. ఈ విషయమై వినియోగదారులకు సందేశాలను పంపిస్తోంది. గత నవంబరులో ఎస్‌బీఐ కార్డ్స్‌ (SBI Cards) ఈ రుసుమును పెంచింది. క్రెడిట్‌ కార్డుల ద్వారా అద్దె చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూనే కార్డు సంస్థలు రుసుములను విధిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు అద్దె మొత్తంలో 1 శాతాన్ని రుసుముగా వసూలు చేస్తున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా ఈనెల 15 నుంచి నుంచి అద్దె మొత్తంలో 1 శాతాన్ని రుసుమును వసూలు చేస్తామని తెలిపింది. ఎంపిక చేసిన కార్డులకు ఈ రుసుము వర్తించదు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఈ నెల 1 నుంచి చెల్లించిన అద్దె మొత్తంలో 1 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.

Also Read:  Pakistan: మునిగిపోవడానికి సిద్ధంగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ: ఫిచ్‌ నివేదిక