బెంగళూరులోని ఆర్సీబీ విజయోత్సవ (RCB Success Meet) పరేడ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede )ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అభిమానంగా వచ్చిన అభిమానుల ప్రేమ క్షణాల్లో చీకటి అయ్యింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు(11 Dies) కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి తండ్రి వేదన ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది. “నాకు ఒక్కడే కొడుకు.. ఇంట్లో చెప్పకుండా వచ్చాడు. ఇప్పుడు తిరిగిరాడని తెలిసిన ఈ పరిస్థితిలో, దయచేసి అతడి శరీరాన్ని కోయొద్దు” అంటూ ప్రభుత్వం ముందు కన్నీటితో వేడుకున్నారు.
Weather : రుతుపవనాలకు అకాల విరామం.. సెగలు కక్కుతున్న సూరీడు.. కారణం ఇదే.!
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లిన సమయంలో తండ్రి చేసిన ఈ విజ్ఞప్తి హృదయవిదారకంగా మారింది. ‘‘ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పరామర్శించారు. కానీ నా కొడుకుని తిరిగి తీసుకురాలేరు. కనీసం అతడి శరీరాన్ని మేము శుభ్రంగా చూడాలన్న కోరికతో, దయచేసి మృతదేహాన్ని ముక్కలు చేయొద్దు’’ అంటూ వేడుకున్నాడు. ఇది ప్రతి తల్లిదండ్రుల హృదయాలను తాకేలా ఉంది. బిడ్డను కోల్పోయిన బాధ ఎంత దారుణమో ఈ తండ్రి బాధ చూస్తే అర్థమవుతోంది.
తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. గాయపడినవారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన ద్వారా పెద్దపెద్ద ఈవెంట్లలో భద్రతాపరమైన ఏర్పాట్లు మరింతగా పటిష్టంగా ఉండాలన్న అవసరం మరోసారి స్పష్టమైంది.