Site icon HashtagU Telugu

IT Raids : నగల దుకాణంపై ఐటీ రైడ్స్.. రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్​

It Raids Min

It Raids Min

IT Raids : ఓ జ్యువెల్లర్స్ దుకాణంపై, ఆ దుకాణం యజమాని కార్యాలయంపై  ఆదాయపు పన్నుల శాఖ జరిపిన రైడ్స్ కలకలం రేపాయి.  ఎందుకంటే ఈ రైడ్స్‌లో లెక్కల్లో చూపించని రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్లు విలువైన ఆస్తి పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

మహారాష్ట్రలోని నాసిక్​లో ఉన్న సురానా జ్యువెల్లర్స్ దుకాణంపై ఐటీ రైడ్స్  కలకలం క్రియేట్ చేశాయి. సురానా జ్యువెలర్స్‌ యాజమాన్యం పన్ను ఎగవేతకు పాల్పడిందనే కారణంతో మే 23న సాయంత్రం నుంచి దాదాపు 30గంటల పాటు ఐటీ శాఖ రైడ్స్ చేసింది. ఐటీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌‌మెంట్ డైరెక్టర్ జనరల్ సతీష్ శర్మ నేతృత్వంలో అధికారులు సురానా జ్యువెల్లర్స్, యజమాని ఆఫీసుపైన  దాడులు చేశారు. నాసిక్, నాగ్‌‌పూర్, జల్గావ్‌లకు చెందిన దాదాపు 55 మంది ఐటీ అధికారుల టీమ్ ఈ ఆపరేషన్​లో పాల్గొంది. నాసిక్ సిటీలోని రాకా కాలనీలో ఉన్న సురానా జ్యువెల్లర్స్ యజమాని బంగ్లాలో కూడా తనిఖీలు చేశారు. ఆయకు సంబంధించిన ప్రైవేట్ లాకర్లు, పలు ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు లాకర్లను చెక్ చేశారు. మన్మాడ్, నంద్​గావ్‌లో ఉన్న సురానా జ్యువెల్లర్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిపారు.

Also Read :Gutka Ban : రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకంపై బ్యాన్

అయితే ఈనెల 23న రైడ్స్ (IT Raids) ప్రారంభించగానే ఐటీ అధికారులకు డబ్బులేం దొరకలేదు. సురానా జ్యువెల్లర్స్ యజమాని బంధువు విలాసవంతమైన బంగ్లాలో కూడా డబ్బు కనిపించలేదు. ఈ క్రమంలో అధికారులకు డౌట్ వచ్చి శనివారం రోజు ఆ బంగ్లాలో ఉన్న ఫర్నీచర్‌ను బద్దలు కొట్టారు. దీంతో డబ్బు కట్టలు బయటపడ్డాయి. ఆ డబ్బును సమీపంలోని స్టేట్ బ్యాంకుకు తరలించి లెక్కించాలని భావించారు. అయితే బ్యాంకు బంద్ చేసి ఉండటంతో.. మొత్తం డబ్బు కట్టలను స్థానిక స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడే దాదాపు 14గంటలపాటు డబ్బు కట్టలను కౌంట్ చేశారు. జప్తు చేసిన క్యాష్‌ను ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో పెట్టి ఏడు కార్లలో తరలించడం గమనార్హం. మొత్తంగా రూ.116 కోట్లు విలువైన సంపదను ఐటీ అధికారులు సీజ్ చేయడం గమనార్హం.

Also Read : Israel Vs Hezbollah : ఇజ్రాయెల్‌‌పై సర్‌ప్రైజ్ ఎటాక్ చేస్తాం : హిజ్బుల్లా