Site icon HashtagU Telugu

INDIA Vs NDA : ‘ఎన్డీయే’ సీట్లను కొల్లగొట్టిన ‘ఇండియా’.. ఎలా అంటే ?

Pm Modi Vs Rahul Gandhi

INDIA Vs NDA : ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి బలమైన పోటీ ఇచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 లోక్‌సభ స్థానాలు రాగా.. ఈసారి ఆ సంఖ్య దాదాపు 94 స్థానాలకు చేరింది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి గత ఎన్నికల్లో 91 లోక్‌సభ స్థానాలు రాగా.. ఈసారి ఆ స్థానాల సంఖ్య మరో 140 పెరిగి 230 దాటింది. ఇవాళ ఉదయం 11 గంటల సమయానికి దేశంలో సగటున ఎన్డీయే కూటమికి 44 శాతం ఓట్లు రాగా, ఇండియా కూటమికి 41 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఓట్ల శాతాలు మారే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి(INDIA Vs NDA) లోక్‌సభ సీట్లు ఏయే రాష్ట్రాల్లో పెరిగాయి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

Also Read :Sarabjit Singh Khalsa : ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడి లీడ్

Also Read : AP & TG Election Results Live Updates : పవన్ కళ్యాణ్ చెప్పిందే జరిగింది..