Site icon HashtagU Telugu

500 Crores – 50 KG Gold : 100 లాకర్లలో రూ.500 కోట్లు, 50 కేజీల గోల్డ్.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Gold Price

Gold Price

500 Crores – 50 KG Gold :  రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) కిరోడి లాల్‌ మీనా సంచలన కామెంట్స్ చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న గణపతి ప్లాజాలోని 100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల బ్లాక్ మనీ, 50 కిలోల గోల్డ్ ను దాచి ఉంచారని ఆయన ఆరోపించారు. పోలీసులు వెళ్లి ఆ లాకర్లను తెరవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వచ్చి లాకర్లను తెరిచే వరకు తాను అక్కడే కూర్చొని ఉంటానని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ లాకర్లు ఎవరివి అనే  వివరాలను ఇప్పుడే బయట పెడితే.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాటిని తెరవనివ్వరని చెప్పారు. జైపూర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కిరోడి లాల్‌ మీనా ఈ కామెంట్స్ చేశారు. లాకర్లు ఉన్న భవనం దగ్గరికి తనతో కలిసి రావాలని మీడియా ప్రతినిధులను కూడా కోరడం (500 Crores – 50 KG Gold) గమనార్హం.  ప్రస్తుతం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాల కారణంగా రాజస్థాన్‌లో రాజకీయ వేడి రాచుకుంది. దుంగార్‌పూర్‌లోని కాంగ్రెస్ నేత దినేష్ ఖోడ్నియా నివాసంలోనూ ఈడీ సోదాలు చేస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్‌కు దినేష్ ఖోడ్నియా సన్నిహితుడనే పేరు ఉంది.

Also Read: Ponnala – BRS : కారెక్కనున్న పొన్నాల ? ఆయన కామెంట్స్ లో అంతరార్ధం అదే ?