Site icon HashtagU Telugu

Last Month of 2022: 2022 సంవత్సరంలో మరో నెల కాలగర్భంలో కలిసిపోయింది.

Dec

Dec

2022 సంవత్సరంలో మరో నెల కాలగర్భంలో కలిసిపోయింది. నవంబర్ 30, 2022 నుంచి డిసెంబర్ 1, 2022లోకి కాలచక్రం మారింది. ఈ సంవత్సరానికి చివరి నెల అయిన డిసెంబర్ నెలలో ఒకటో తేదీ వచ్చేసింది. కొత్తగా కొన్ని నిర్ణయాలు, నిబంధనలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ మార్పులేంటో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటూ మధ్య తరగతి ప్రజలు జీవనం సాగించడం ప్రతి నెలా ఉండేదే. అందుకు కారణం లేకపోలేదు. ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొన్ని రూల్స్ మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడేందుకో లేదా ఊరట కలిగించేందుకో కారణం కావచ్చు.

ఇండియన్ రైల్వేస్ కొత్త టైం టేబుల్:

శీతా కాలం కావడంతో మంచు తీవ్రంగా కురుస్తుంటుంది. ఆ మంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు భారతీయ రైల్వే శాఖ నేటి నుంచి రైళ్ల రాకపోకల్లో కొన్ని మార్పులుచేర్పులు చేసింది. కొత్త టైం టేబుల్ ప్రకారం నేటి నుంచి రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

బ్యాంకు సెలవులు:

2022 డిసెంబర్‌లో ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిలో 8 రోజులు సెలవులు కాగా మిగిలిన ఆరు రోజులు వీకెండ్ సెలవులు కావడం గమనార్హం. అయితే 14 రోజుల పాటు దేశంలోని అన్ని చోట్ల బ్యాంకులు మూతపడవన్న సంగతి గమనించగలరు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

విమాన ఇంధన ధరలు:

విమాన ఇంధన ధరలు డిసెంబర్ 1న తగ్గాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు విమాన ఇంధన ధరలను 2.3 శాతం తగ్గించాయి. తాజా సవరణతో ATF ధర కిలోలీటర్‌పై రూ.2,775 తగ్గి రూ.1,17,587.64కు చేరడం గమనార్హం. ఎయిర్‌లైన్స్‌కు ఈ తగ్గింపు కాస్తంత ఊరటనిచ్చే అంశం.

పీఎన్‌బీ ఏటీఎం రూల్స్:

సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా వినియోగదారుల ప్రైవసీని మరింత కాపాడేందుకు పంజాన్ నేషన్ బ్యాంకు ఏటీఎం కార్డుకు సంబంధించి ఒక మార్పు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం మెషీన్‌లో డబ్బు విత్ డ్రాకు సంబంధించి చేసిన ఆ మార్పు ఏంటంటే PNB ATM లో ఇకపై డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు మెషీన్లో ఇన్‌సర్ట్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ, ఏటీఎం పిన్ నంబర్ రెండూ ఎంటర్ చేస్తేనే వినియోగదారుడు డబ్బు పొందగలడు.

జీవన్ ప్రమాణ్ (Life Certificate):

డిసెంబర్ 1 నుంచి పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను Submit చేయలేరు. నంబర్ 30తో Submission Deadline ముగిసింది.

ఎల్పీజీ ధరలు:

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీ కమర్షియల్, డొమెస్టిక్ ఎల్పీజీ ధరల్లో మార్పు చేస్తుంటాయి. గత నెల కమర్షియల్ గ్యాస్ ధరను 115 రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే. నేడు కూడా ఎల్పీజీ ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది.