Agni 5 Missile : ఇండియా ఖాతాలో మరో క్రెడిట్

క్షిపణి పరీక్షల్లో ఇండియా మరో సక్సెస్ స్టెప్ వేసింది. ఒక భూభాగం పైనుండి మరో భూభాగంపైకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.

  • Written By:
  • Updated On - October 28, 2021 / 11:34 AM IST

క్షిపణి పరీక్షల్లో ఇండియా మరో సక్సెస్ స్టెప్ వేసింది. ఒక భూభాగం పైనుండి మరో భూభాగంపైకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5,000 కిలోమీటర్లకుపైగా నిర్దేశిత లక్ష్యాన్ని ఆగ్ని-5 ఖచ్చితత్వంతో చేరుకుంది. అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి 8వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించనున్నట్లు సమాచారం.మూడు-దశల ఘన ఇంధనంతో కూడిన ఇంజిన్‌ను ఉపయోగించే ఈ క్షిపణి అత్యంత ఎక్కువ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు.

ఈ క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వాస్తవానికి అగ్ని-5 పరీక్ష 2020లోనే జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడింది. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యంలో రూపొందించారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. తాజా ప్రయోగంతో భారత్ శక్తి ప్రపంచానికి మరోసారి తెలిసినట్టయ్యింది. సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ తాజా ప్రయోగంతో భారత్ గట్టి సందేశం పంపిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు