Site icon HashtagU Telugu

Message From Jail : ఢిల్లీ నెక్ట్స్ సీఎం సునీతా కేజ్రీవాల్ ? ఇదేనా సంకేతం ?!

Message From Jail

Message From Jail

Message From Jail : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి తన తొలి సందేశాన్ని విడుదల చేశారు. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీతా కేజ్రీవాల్ ఇవాళ ఉదయం చదివి వినిపించారు.

We’re now on WhatsApp. Click to Join

కేజ్రీవాల్ సందేశం ఇలా ఉంది.. ‘‘ప్రతి ఒక్కరూ సమాజం కోసం పని చేస్తూనే ఉండాలి. ఎవరినీ ద్వేషించవద్దు. బీజేపీ వాళ్లు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. అయినా బీజేపీ వాళ్లను కూడా ద్వేషించకండి. భారతదేశంలో, వెలుపల దేశాన్ని బలహీనపరిచే అనేక శక్తులు ఉన్నాయి. మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ శక్తులను గుర్తించి వాటిని ఓడించాలి. ఢిల్లీలోని మహిళలు కేజ్రీవాల్ కటకటాల వెనుక ఉన్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా రూ.1000 అందుతాయా లేదా అని వారు ఆవేదనకు లోనవుతున్నారు. నేను మీ సోదరుడిని, మీ కొడుకును.. నన్ను  నమ్మండి.. నన్ను ఎక్కువ కాలం కటకటాల వెనుక ఉంచలేరు. నేను త్వరలోనే బయటకు వచ్చి నా వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాను’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Message From Jail పేర్కొన్నారు.

Also Read :Zomato CEO: ప్ర‌ముఖ మోడ‌ల్‌ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో..!

కేజ్రీవాల్ అరెస్టు తర్వాత తొలిసారిగా శుక్రవారం సాయంత్రం ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ‘‘మోదీజీ .. మూడుసార్లు వరుసగా ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని మీ అధికార అహంకారంతో అరెస్టు చేయించారు. మీరు అందరినీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన ద్రోహం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎల్లప్పుడూ ధైర్యంగా నిలబడతారు. ఆయన ఎక్కడున్నా జీవితం దేశానికే అంకితం. ప్రజలకు అన్నీ తెలుసు’’అని పేర్కొన్నారు.

Also Read :Digvijaya Singh: 33 ఏళ్ల త‌ర్వాత లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో మాజీ సీఎం

అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అరెస్టు చేసింది. తాజాగా శుక్రవారం రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ  కోర్టు ఆయనను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో తిరిగి హాజరుపర్చనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం రేసులో ఆప్ నేత అతిషి, సౌరభ్, గోపాల్ రాయ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉన్నారని తెలుస్తోంది. ఫస్ట్ ప్రయారిటీ సునీతా కేజ్రీవాల్‌‌కు ఇస్తారని సమాచారం.