ATM Stolen: బెంగళూరులో ఏటీఎం చోరీ కలకలం.. ట్రక్కులో వేసుకుని వెళ్లిన దొంగలు!

బెంగళూరులో దొంగలు షాకింగ్ పని చేశారు. ఏకంగా ఏటీఎంనే దొంగిలించారు

  • Written By:
  • Publish Date - December 13, 2022 / 09:33 PM IST

ATM Stolen: ఏటీఎం దొంగతనాలు గురించి మనం రోజూ వార్తల్లో వింటూనే ఉంటాం. రోజు దేశంలో ఎక్కడో ఒకచోట ఏటీఎం చోరీలు జరుగుతూనే ఉంటాయి. వార్తల్లో ఇలాంటి ఘటనలు రోజూ వస్తూనే ఉంటాయి. ఏటీఎంలను పగలగొట్టి డబ్బులను తీసుకెళ్లడమో.. లేదా ఏటీఎంనే నేరుగా దొగలించి తీసుకెళ్లడమో జరుగుతూ ఉంటాయి. అలాగే ఫేక్ ఏటీఎం కార్డులు కూడా సృష్టించి డబ్బులు విత్ డ్రా చేసే లాంటి సైబర్ నేరాలు కూడా వెలుగు చూస్తున్నాయి.

క్లోనింగ్ ఏటీఎం కార్డులను సృష్టించి వాటితో డబ్బులను డ్రా చేస్తున్నారు. అయితే తాజాగా బెంగళూరులో ఓ గ్యాంగ్ ఏటీఎం మెషీన్ ను దొగలించింది. ఏటీఎంను చోరీ చేసి ట్రక్కుల్లో తీసుకెళ్లారు. బెంగళూరులోని శివారు ప్రాంతాలకు ట్రక్కును తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఏటీఎంను పగలకొట్టి అందులో ఉన్న డబ్బును తీసుకున్నారు. తర్వాత ఏటీఎంను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.

చోరీకు గురైనది బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కాగా.. దాదాపు రూ.3.13 లక్షల నగదు ఏటీఎంలో ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఏటీఎం చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను గుర్తించారు. నిందితుల్లో నలుగురిని పట్టుకుని అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కర్ణాటకలోని ఆగ్నేయ బెంగళూరులోని సబర్బ్ బెల్లందూర్‌లో ఈ ఏటీఎం చోరీ ఘటన జరిగింది. ఈ ఏటీఎం చోరీ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఐదుగురు నిందితులు వచ్చి బ్యాంక్ ఏటీఎంను ఎత్తుకుని బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి ఉంచిన ట్రక్కులో వేసుకుని వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏటీఎం చోరీ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది.బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.