Threat Call : ప్రధాని మోడీని చంపేస్తా.. ఎన్ఐఏ కంట్రోల్ రూమ్​కు ఫోన్ కాల్

తమిళనాడులోని చెన్నై నగరం పురశైవాకం ఏరియాలో ఉన్న నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆఫీస్‌ కంట్రోల్‌ రూంకు ఒక బెదిరింపు కాల్‌ వచ్చింది.

  • Written By:
  • Updated On - May 23, 2024 / 12:23 PM IST

Threat Call :  తమిళనాడులోని చెన్నై నగరం పురశైవాకం ఏరియాలో ఉన్న నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆఫీస్‌ కంట్రోల్‌ రూంకు ఒక బెదిరింపు కాల్‌ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేస్తానని ఓ వ్యక్తి హిందీలో బెదిరించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్ వచ్చిన వెంటనే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు చెన్నై పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీనిపై చెన్నైలోని సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన ప్రదేశాన్ని కచ్చితంగా కనుగొనడంపై ప్రస్తుతం అధికారులు ఫోకస్ చేస్తున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన సిమ్ కార్డు లొకేషన్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

తల్లి కడుపున పుట్టినట్లు భావించను : మోడీ

తన పుట్టుక విషయంలో ప్రధాని మోడీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ.. ‘‘నేను తల్లి కడుపున పుట్టినట్లు భావించను. నన్ను దేవుడు నేరుగా పంపినట్లే భావిస్తాను. ఈ విషయంలో నాకు నేను ఇలాగే సమాధానపర్చుకుంటున్నాను’’ అని  పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం గురించి అడిగిన ప్రశ్నకు మోడీ ఈ సమాధానం ఇచ్చారు.

మోడీ బయోపిక్‌లో నటించను.. నా సిద్ధాంతాలకు వ్యతిరేకం : కట్టప్ప

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా విశ్వనేత పేరుతో సినిమా రానుందట. అయితే దీనికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడీ బయోపిక్ లో బాహుబలి ఫేమ్ సత్య రాజ్ (కట్టప్ప) నటిస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఈ నేపధ్యంలో సత్య రాజ్ స్పందించారు.  నరేంద్ర మోడీ బయోపిక్‌లో తాను  నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఈ వార్తలు చూసి తాను షాకయ్యానని తెలిపారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కట్టప్ప కోరారు. భవిష్యత్‌లో మోడీ బయోపిక్‌ కోసం తనను ఎవరైనా సంప్రదించినా చేయననే చెప్తానని సత్యరాజ్ స్పష్టం చేశారు. అది తన సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమని తేల్చి చెప్పారు.

Also Read : Karimnagar – Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లి.. గెస్టులకు గిఫ్టుగా కరీంనగర్ ఫిలిగ్రీ ప్రోడక్ట్స్