Site icon HashtagU Telugu

Imran Khan : బెయిల్ గడువు ముగియగానే ఇమ్రాన్ అరెస్టు!!

Imran Khan

Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బెయిల్‌ గడువు ముగియగానే అరెస్ట్‌ చేస్తామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా వెల్లడించారు. ఇమ్రాన్ పై అల్లర్లు, దేశద్రోహం, గందరగోళం, సాయుధ దాడులతో సహా రెండు డజన్లకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. బెయిల్ గడువు ముగియగానే ఇమ్రాన్ ను బనిగాలా నివాసం వెలుపల సెక్యూరిటీ అరెస్టు చేస్తుందని స్పష్టం చేశారు. పెషావర్ హైకోర్టు  జూన్ 2న ఇమ్రాన్ ఖాన్‌కు మూడు వారాల ట్రాన్సిట్ బెయిల్ ను మంజూరు చేసింది. బెయిలు కోసం పాకిస్తాన్ హైకోర్టు రూ. 50,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ, ఆమె స్నేహితురాలు ఫరా గోగీల త్రయం బిలియన్ల కొద్దీ డబ్బును సంపాదించారని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ ఆరోపించింది.

Exit mobile version