IMD Warns: ఈ ఏడాది చలి పులి పంజా విసిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌తో వానాకాలం ముగిసింది. ఉత్తర భారతదేశానికి విస్తరించిన నైరుతి రుతుపవనాల తిరోగమనం కూడా ప్రారంభమైంది. అయితే ఈ పవనాల కదలికలు కాస్త నెమ్మదిగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో లా నినా ఏర్పడే పరిస్థితులు ఉండడంతో దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని భారత వాతావరణశాఖ (IMD Warns) భావిస్తోంది.
చలి నుంచి ఇంకా ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఉత్తర భారతదేశంలో ఎముకలు కొరికే చలిగాలులు, దట్టమైన పొగమంచు రానున్న కొద్ది రోజులుగా కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర భారతదేశంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. కాగా రానున్న మూడు రోజుల్లో వాయువ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: Tirumala: తిరుమలలో శ్రీవారి నామాలే మార్మోగాలి: సీఎం చంద్రబాబు
కనిష్ట ఉష్ణోగ్రతలో మార్పుకు అవకాశం
ఉత్తర భారతదేశంలోని చాలా చోట్ల సాధారణం కంటే మైనస్ 1 డిగ్రీల సెల్సియస్ నుండి మైనస్ 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉందని IMD తెలిపింది. శుక్రవారం అమృత్‌సర్ (పంజాబ్)లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తూర్పు రాజస్థాన్, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. హర్యానా, పశ్చిమ రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో చలిగాలులు కొనసాగుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని, ఆ తర్వాత గణనీయమైన మార్పు ఉండదని IMD తెలిపింది. అయితే వచ్చే ఐదు రోజుల్లో వాయువ్య భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం లేదు.
వాతావరణ శాఖ ప్రకారం.. శని, ఆదివారాల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్ ,ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో చలిగాలుల పరిస్థితులు కొనసాగుతాయి. ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానాలలో ఆదివారం మంచు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
లా నినా ప్రభావం వల్ల ఈ ఏడాది భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన చలికాలం ఉండవచ్చు. ఇప్పుడు ప్రశ్న లా నినా అంటే ఏమిటి? వాతావరణ శాఖ ప్రకారం.. తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం ఉపరితలంపై అల్ప వాయు పీడనం గణనీయంగా పెరిగినప్పుడు కాలానుగుణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనినే లా నినా అంటారు. ఈ ప్రక్రియ కారణంగా సముద్ర ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. దీని ప్రభావం అధిక వర్షం, చలిని కలిగిస్తుంది.