Site icon HashtagU Telugu

IMD – Google : గూగుల్‌తో భారత వాతావరణ విభాగం జట్టు.. ఎందుకు ?

Imd Google

Imd Google

IMD – Google : భారత వాతావరణ విభాగం (ఐఎండీ), గూగుల్‌తో  ఒప్పందం కుదుర్చుకుంది. ముందస్తు వర్ష సూచనలను మరింత కచ్చితత్వంతో గుర్తించేందుకు ఈ భాగస్వామ్యాన్ని ఐఎండీ కుదుర్చుకుంది.  దేశంలో నిర్దిష్ట ప్రాంతంలో వర్షం పడే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునేందుకు వీలుగా గూగుల్‌ ఏషియాతో ఐఎండీ జట్టు కట్టింది. ఇకపై ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌), ఐఎండీ సంయక్తంగా సముద్ర జలాల్లో ఏర్పడే ప్రతికూల పరిస్థితులపై ముందస్తు హెచ్చరికలను జారీ చేయనున్నాయి. సముద్రంలో ఏర్పడే రాకాసి అలలు, సునామీ, తుఫాన్లపై ఐఎండీ ముందస్తు హెచ్చరికలు చేయనున్నాయి. సముద్ర జలాల పరిస్థితిపై ప్రతి రోజు ఐఎండీ బులెటిన్లను విడుదల చేయనుంది. ఈ హెచ్చరికలకు అనుగుణంగా సముద్ర తీరాల్లో ఎలాంటి సమాచార వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాల మత్స్యకారులకు నావిక్‌ మెసేజింగ్ సర్వీస్‌ ద్వారా అలర్ట్‌లను పంపించనున్నారు. ఈవివరాలను కేంద్ర భూశాస్త్ర శాఖ మంత్రి కిరెన్‌ రిజుజు రాజ్యసభకు తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈవివరాలను(IMD – Google) వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

వర్షాలను అంచనా వేయడంలో ఐఎండీ విఫలమైంది : సీఎం స్టాలిన్

తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాల్లో డిసెంబర్ 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేయలేకపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసీ) ఆలస్యంగా డిసెంబర్ 17న భారీ వర్షపాతం గురించి తెలియజేసిందని చెప్పారు. వాతావరణ కేంద్రం అంచనా వేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ వర్షం కురిసిందని తెలిపారు. తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాలు తూత్తుకుడి, తిరునెవేలి, తెన్‌కాసి, కన్యాకుమారిలలో  డిసెంబర్ 17, 18 తేదీల్లో భారీ వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. 1871 సంవత్సరం తర్వాత ఈ ప్రాంతంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. ఈ జిల్లాల్లో సగటున  21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేయగా.. తూత్తుకుడి జిల్లాలోని కాయల్‌పట్నంలో ఒక్క రోజులోనే 95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read: ECI – Derogatory Words : పొలిటికల్ లీడర్స్.. ప్రసంగాల్లో అలాంటి భాషను వాడొద్దు : ఈసీ