Site icon HashtagU Telugu

Rajya Sabha: రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉషా, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్!

Rajysabha

Rajysabha

తాజాగా కేంద్ర ప్రభుత్వం పరుగుల రాణి పి.టి.ఉష అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజా, మరియు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే లను రాజ్యసభకు నామినేషన్ చేసిందట. తాజాగా రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేసిందట కేంద్ర ప్రభుత్వం.

అయితే కేంద్ర ప్రభుత్వం వీరిని రాజ్యసభకు నామినేట్ చేయడంతో వారందరినీ అభినందిస్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.