Ramayana Skit : రామాయణం.. యావత్ మానవాళికి జీవన మార్గదర్శకం. దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటి మహోన్నత రామాయణంపై ఐఐటీ బాంబేలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన ‘రాహోవన్’ నాటకం వివాదాస్పదమైంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులో ఐఐటీ బాంబే వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించిన ‘రాహోవన్’ నాటకంలో పవిత్ర రామాయణాన్ని కించపర్చారనే ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నాటకంలో ఎక్కడా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను ప్రస్తావించలేదు. అయితే అరణ్యవాసంలోని ఘట్టాలతో పోలిన సన్నివేశాలను ప్రదర్శించారు. ఈ సన్నివేశాల్లో నటించిన విద్యార్థుల భాష, హావభావాలపై అంతటా అభ్యంతరం వ్యక్తమైంది. ఆ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారడంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. నాటిక ప్రదర్శించిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
‘రాహోవన్’ నాటకంలో(Ramayana Skit) నటించిన ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ఐఐటీ బాంబే యాజమాన్యం వెల్లడించింది. ఈ నాటకంలో నటించిన వారిలో గ్రాడ్యుయేట్ విద్యార్థులు, జూనియర్లు ఉన్నారు. అయితే జరిమానా అనేది సీనియర్లకు ఒక్కొక్కరికీ రూ.1.2 లక్షలు చొప్పున విధించారు. వీరు జింఖానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులని ఐఐటీ బాంబే మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ ఫైన్ వారి సెమిస్టర్ ఫీజుకు దాదాపు సమానం. ఇక, ఈ నాటకంలో నటించిన జూనియర్లకు దాదాపు రూ.40వేలు చొప్పున జరిమానా విధించారు. వీరు హాస్టల్ సదుపాయాలను పొందడంపైనా బ్యాన్ విధించారు.
Also Read : Leaked NEET Paper : లీకైన ‘నీట్’ పేపర్.. ఎగ్జామ్‌లో వచ్చిన పేపర్ ఒక్కటే : అభ్యర్థి వాంగ్మూలం
రాముడి గొప్పతనం..
- రాముడు గుణవంతుడు. ధర్మం తెలిసినవాడు.
- రాముడు తండ్రి మాటకు గౌరవం ఇచ్చి దానికి కట్టుబడి ఉండే ఉత్తముడు.
- శివధనస్సు విరిచి సీతాదేవిని పరిణయమాడటం బట్టి వీరుడిగా, ధీరుడిగా వెలిగాడు.
- సీతను రావణుడు అపహరించినప్పుడు సహనంతో, నేర్పుతో సీతను దక్కించుకున్నాడు.
- తన తమ్ముళ్లపై అవ్యాజ్యమైన ప్రేమ ఉన్నవాడు రాముడు.
- యుద్ధనీతి తెలిసినవాడు రాముడు. సీతను తనకు అప్పగించమని యుద్ధానికి ముందే రావణుడికి రాయబారం పంపిన దయార్ద్ర హృదయుడు రాముడు.
- ప్రజలను కన్నబిడ్డలుగా భావించి రాముడు అయోధ్యను పరిపాలించాడు.