Site icon HashtagU Telugu

Delayed Train Benefits: రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఎన్ని రకాల ఉపయోగాలో తెలుసా?

Trains

Trains

సాధారణంగా ఎక్కడికైనా దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువగా రైళ్లు ప్రయాణం ఇష్టపడుతూ ఉంటారు. ఈ రైలు ప్రయాణం ద్వారా నిత్యం కొన్ని లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. భారతదేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తున్నారు. అయితే ఈ రైల్వే ప్రయాణం చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు రైలు అనుకోకుండా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రైలు ఆలస్యం అయితే ప్రయాణికులకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రైలు ఆలస్యంగా వచ్చినప్పుడు అందించే ప్రయోజనాలన్నీ కూడా రైల్వే ఒక రూపాయి చార్జీ వసూలు చేయకుండా ఉచితంగా అందిస్తుందట. ఈ విషయం చాలామందికి తెలియదు. రైలు ఆలస్యమైనప్పుడు రైల్వే ఉచిత ఖర్చుతో కొన్ని సర్వీసులను అందిస్తుంది. ఐఆర్‌సీటీసీ ప్రకారం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు భారతీయ రైల్వే ఉచితంగా ఫుడ్, డ్రింక్ సౌకర్యాలను అందిస్తుందట. ఈ విషయం చాలా కొద్ది మందికే మాత్రమే తెలుసు. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని ఈ సందర్భంగా ప్రయాణికులు తప్పనిసరిగా వాడుకోవచ్చు. శతాబ్ది, దొరంతో, రాజధాని వంటి రైలు ప్రయాణికులకు ఈ హక్కులు ఎంతో ఉపయోగకరం. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు ఉచితంగా ఫుడ్‌ ను అందిస్తుంది.

ట్రైన్ రెండు గంటలకుపైగా ఆలస్యమైతే ప్రయాణికులకు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ లేదా లైట్ మీల్స్ అందించాల్సిన నిబంధన ఉంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు చాలా వరకు ఈ ఫెసిలిటీస్‌ ను తమ ప్రయాణికులకు ఆఫర్ చేస్తూ ఉన్నాయి. తన మెనూ ప్రకారం మీల్స్‌ను ప్రయాణికులకు అందిస్తూ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం టీ లేదా కాఫీ, బిస్కెట్స్, ఈవినింగ్ స్నాక్స్ కింద టీ లేదా కాఫీ, బట్టర్‌తో పాటు బ్రెడ్, లంచ్, డిన్నర్‌కి రెండు రకాల వంటలను ప్రయాణికులకు ట్రైన్‌లో అందిస్తుంది. ఉప్పు, పెప్పర్‌ను కూడా అందిస్తుంది. దాల్ ఛావ్, పచ్చడి, పూరి, మిక్స్‌-వెజిటేబుల్స్ ప్రయాణికులకు లభిస్తాయి. మరి ఇక మీదట అయినా ఇటువంటి సర్వీసులను ప్రజలు ఉపయోగించుకోండి.