ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో “సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన” (Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana) అనే పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత సౌర విద్యుత్ అందించనున్నారు. సుస్థిర శక్తి వినియోగాన్ని పెంపొందించేందుకు మరియు దేశంలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా బడ్జెట్ ప్రసంగంలో ఈ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రకటించి, ప్రజలందరికీ లాభదాయకంగా ఉంటుందన్నారు.
Chandrababu : మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలనుకునే వారు ముందుగా pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ “Quick Links” సెక్షన్‌లోకి వెళ్లి “Apply for Rooftop Solar” అనే లింక్‌ను క్లిక్ చేయాలి. కొత్తవారు రిజిస్టర్ చేసుకోవాలి, ఇప్పటికే రిజిస్టర్ అయినవారు తమ వివరాలతో లాగిన్ కావాలి. రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్రం, డిస్కం (ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) పేరు, కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు పూర్తయ్యాక డిస్కం అనుమతి కోసం వేచి చూడాలి.
అనుమతి వచ్చిన తర్వాత అధికారికంగా గుర్తించబడిన విక్రేత ద్వారా సోలార్ ప్లాంట్‌ను ఇన్స్టాల్ చేయించాలి. ప్లాంట్ ఏర్పాటైన తరువాత అదే పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేసి నెట్ మీటర్‌కు అప్లై చేయాలి. నెట్ మీటర్ కూడా అమర్చిన తర్వాత అధికారుల తుది తనిఖీ జరుగుతుంది. ఆ తర్వాత పోర్టల్ ద్వారా కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఇలా ప్రతి కుటుంబం తన ఇంటిపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్‌ను సులభంగా పొందవచ్చు.