Site icon HashtagU Telugu

Business Idea : మీ ఇంట్లో ఖాళీ సమయంలో ఈ వ్యాపారం ప్రారంభిస్తే…లక్షాధికారి అవ్వడం ఖాయం.

Business Plan

Business Plan

నేటికాలంలో చాలామంది ఉద్యోగాలపై కాకుండా వ్యాపారాలపై (Business idea)ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కంటే…అదే సమయాన్ని వ్యాపారంలో కేటాయిస్తే మంచి లాభాలు పొందవచ్చన్న ఆలోచనలో నేటి యువత ఉంది. ముఖ్యంగా చదువుకుని…ఉద్యోగం చేయలేక ఇంటి బాధ్యతలు, పిల్లలు, కుటుంబం బాధ్యతలకే పరిమితమైన మహిళలు ఇంట్లోనే కూర్చుండి చేసే వ్యాపారాలెన్నో ఉన్నాయి. చదువులేకున్నా పర్వాలేదు..కనీస అవగాహాన ఉంటే చాలు. ఇంటి పనితోపాటు ఖాళీ సమయంలో ఈ వ్యాపారం చేస్తే మంచి ఆదాయం సొంతం చేసుకోవచ్చు. చేయాల్సిందల్లా వ్యాపారంలో కొంచెం డెవలప్ మెంట్ వచ్చేంత వరకు కష్టపడాలి. ఒక్కసారి మీ వ్యాపారం ప్రజాధారణ పొందిందంటే చాలు ఆటోమెటిగ్గా మారెట్లో మీరు ఫేమస్ అవుతారు.

అయితే నేటి ఎపిసోడ్ లో మీకు ఊరగాయల వ్యాపారం గురించి వివరిస్తాము. అవును మీరు గృహిణి అయితే, మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మేము మీకు ఊరగాయల వ్యాపార ప్రణాళిక గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. మీరు చాలా తక్కువ ధరతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ ప్రారంభించేందుకు మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీకు ఇంట్లో 400 నుండి 500 చదరపు అడుగుల గది ఉంటే సరిపోతుంది. ఎంచక్కా ఇల్లును పిల్లలను చూసుకుంటు ఈ వ్యాపారం చేయవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించేందుకు చాలా తక్కువ పెట్టుబడి అవసరం. కేవలం రూ. 10,000 ఉంటే చాలు. ఒక వేళ మీరు ఇతరులపై ఆధారపడకుండా పదివేలు కూడా అప్పుగా తీసుకోవాలంటే ముద్ర లోన్ ద్వారా తీసుకోవచ్చు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీతో ముద్ర స్కీం ద్వారా లోన్ అందిస్తుంది. దీనిలో మీరు రూ.50వేల నుంచి 10లక్షల వరకు తీసుకోవచ్చు.

మీకు ఈ వ్యాపారాన్ని కేవలం పదివేలతో ప్రారంభించవచ్చు. మీరు తయారు చేసే ఊరగాయలు రుచికరంగా ఉండి..మీ చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తే…మీరు మార్కెట్లోకి వీటిని సేల్ చేయవచ్చు. అంతేకాదు మీరు పెట్టే ఊరగాయాలు కస్టమర్లకు నచ్చితే విదేశాలకూ పంపించే ఆర్డర్లను కూడా మీరు తీసుకోవచ్చు. దీని తర్వాత మీరు ప్రతి నెలా రూ.30వేల నుంచి రూ.40,వేల వరకు సంపాదించవచ్చు. మీ వ్యాపారం పెద్దదైతే, ఈ సంపాదన అనేక రెట్లు పెరుగుతుంది.

మీరు మీ వ్యాపారాన్ని మరింత డెవలప్ చేసుకునేందుకు ఆన్‌లైన్ విక్రయాల ద్వారా కానీ హోల్‌సేల్ మార్కెట్ ద్వారా కానీ రిటైల్ మార్కెట్‌లో కూడా ఈ ఊరగాయలను విక్రయించుకునే ఛాన్స్ ఉంటుంది. .ఈ బిజినెస్ ప్రారంభించడానికి, ఊరగాయ తయారీలో ముందుగా మీరు ట్రైనింగ్ తీసుకోండి. ఆ తర్వాత మీరు FSSAI నుండి పర్మిషన్ తీసుకుని ఊరగాయ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు