Business Idea: వేసవిలో ఈ వ్యాపారం ప్రారంభించండి. రోజుకు రూ.6వేలు సులభంగా సంపాదిస్తారు.

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 08:45 PM IST

మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?(Business Idea)అయితే మేము మీ కోసం ఒక గొప్ప వ్యాపార ఆలోచనను మీ ముందుంచుతున్నాం. వేసవిలో వాటర్ బాటిళ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ద్వారా బాగా సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో మీకు ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. ఆదాయం మాత్రం బాగుంటుంది.

మీరు మార్కెట్‌లో చాలా బ్రాండ్‌ల వాటర్ బాటిళ్లను చూసి ఉంటారు. మీరు ఈ 1 లీటర్, 2 లీటర్ సీసాలు, 5 లీటర్, 10 లీటర్, 20 లీటర్ వాటర్ బాటిళ్లను కూడా తయారు చేయవచ్చు. మీరు మీ బ్రాండ్‌ను కూడా అదే విధంగా నిర్మించవచ్చు. మీరు బాటిల్ వాటర్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో ఈ రోజు మేము మీకు వివరిస్తాము.

ఎలా ప్రారంభించాలి?
వాటర్ బాటిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు మీ నగరంలో దాని మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. దీని తరువాత, అవసరమైన యంత్రాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయాలి, దీని కోసం నీళ్లు నిల్వ చేసేందుకు వాటర్ ట్యాంక్ అవసరం ఉంటుంది. నీటిని ఫిల్టర్ చేయడానికి మీరు RO యంత్రాన్ని పొందాలి. ఈ యంత్రం అనేక రకాలుగా వస్తుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు బాటిళ్లను ప్యాక్ చేయడానికి యంత్రాన్ని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఈ వ్యాపారం కోసం మీరు ల్యాబ్ నుండి ఫీడ్ వాటర్ టెస్ట్ రిపోర్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి ISI ధృవీకరణ, స్థానిక పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోవాలి . ఇది కాకుండా, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి, మీరు స్థానిక పరిపాలన నుండి విక్రేత లైసెన్స్ తీసుకోవాలి. అదే సమయంలో, మీ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుండి వ్యాపార అనుమతిని కూడా పొందవలసి ఉంటుంది. దీని తర్వాత, మీ సంస్థను నమోదు చేయడంతో పాటు, మీరు వ్యాపారం GST రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

లాభం ఎంత ఉంటుంది?
మీరు వాటర్ బాటిల్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే, మీరు దాని నుండి చాలా లాభం పొందవచ్చు. ఇందులో 1 లీటర్ బాటిల్ ఖరీదు చూస్తే అన్ని ఖర్చులు కలుపుకుంటే గరిష్ఠంగా రూ.3-4 వస్తుంది. అదే సమయంలో, దాని హోల్‌సేల్లో అమ్ముతే మార్కెట్‌లో రూ.6-7కు అమ్ముడుపోతుంది. ఈ విధంగా, ఒక్కో బాటిల్‌పై కనీసం రూ. 3 లాభాన్ని సులభంగా పొందుతారు. రోజుకు 2000 లీటర్ల నీరు సరఫరా చేస్తే కనీసం 6000 రూపాయల లాభం వస్తుంది.