మణిపూర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పలు పథకాల ప్రయోజనాలు పొందాలంటే కుటుంబంలోని పిల్లల సంఖ్యను పరిమితం చేసింది. ఒక కుటుంబంలో నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదన్న ఖండిషన్ పెట్టింది. నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబానికి ఉద్యోగాలు, పలు ప్రభుత్వ పథకాల నుంచి మినహించాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి ఎస్ రంజన్ తెలిపారు.
మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి రాష్ట్ర జనాభా కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో జనాభా కమిషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర అసెంబ్లీ గతంలో ప్రైవేట్ మెంబర్ తీర్మానాన్ని ఆమోదించిందినట్లుగా రంజన్ చెప్పారు. రాష్ట్రంలోకి బయటి వ్యక్తులు చొరబడుతున్నారనే ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే ఖుముక్చమ్ జోయ్‌కిసాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
https://twitter.com/MegaNewsUpdates/status/1580909219619827712?s=20
తీర్మానంలో, జాయ్‌కిసన్ రాష్ట్రంలో జనాభా సరళిని మార్చడం గురించి మాట్లాడారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, 1971-2001 మధ్యకాలంలో మణిపూర్‌లోని కొండ జిల్లాలు 153.3 శాతం జనాభా వృద్ధిని కలిగి ఉన్నాయన్నారు. 2001-2011లో ఇది 250 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నాగాలు, కుకీలు, జోమిలతోపాటు ఇతర గిరిజనులు ఎక్కువగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారని తెలిపారు. ఏడాది క్రితం అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఇవ్వబోమని పేర్కొంది.