Business Ideas: మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. 50వేలు సంపాదించడం గ్యారెంటీ

  • Written By:
  • Publish Date - March 31, 2023 / 05:18 PM IST

నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తుంది. అందుకే చాలామంది ఇళ్లలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. కొందరికి ఇల్లు, పిల్లలను చూసుకునే వారు లేక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. అలాంటి మహిళలు (Business Ideas) కూడా నెలకు రూ. 50వేలు సంపాదించవచ్చు. మహిళలకు డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చుని కూడా డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారాల్లో మీకు రోజు ఓ వ్యాపారం గురించి పరిచయం చేస్తాం. ఈ వ్యాపారాన్ని ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అదేంటో చూద్దాం.

ప్రపంచం సగం మునిగిపోయినా సరే అందం మీద ఇంట్రెస్ట్ తగ్గదు. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీన్నే బిజినెస్ గా మలుచుకుంటే ఎలా ఉంటుంది. అవును బ్యూటీ పార్లర్ ప్రారంభిస్తే నిరంతరం బిజీగా ఉంటారు. బ్యూటీపార్లర్ అంటే మహిళలకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి. కోవిడ్ లాంటి సంక్షోభం సమయంలోనే ఈ బిజినెస్ కు డిమాండ్ తగలేదంటే అర్థం చేసుకోండి. మీ ఖజనా నింపాలంటే బ్యూటీపార్లర్ ను ప్రారంభించండి. దీని డబ్బు సంపాదించవచ్చు.

బ్యూటీ పార్లర్ ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం. మహిళలకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. కరోనా సంక్షోభం సమయంలో కూడా డిమాండ్ ఉన్న బ్యూటీ పార్లర్ మీ ఖజానాను నింపిందనడంలో సందేహం లేదు. మీకు కూడా అందం మీద ఆసక్తి ఉంటే బ్యూటీ పార్లర్ తెరవడం ద్వారా సంపాదించడం ప్రారంభించవచ్చు.

బ్యూటీ పార్లర్ ను ప్రారంభించడం ఎలా?
బ్యూటీ పార్లర్ ను ప్రారంభించాలంటే బ్యూటీషియన్ కోర్సు తప్పనిసరి. లేదంటే ముందుగా పార్లర్ లో ట్రైనింగ్ తీసుకోని ఉండాలి. అప్పుడే బ్యూటీ పార్లర్ వ్యాపారం గురించి ఆలోచించాలి. ఎందుకంటే ట్రైనింగ్ లేకుండా ఈ వ్యాపారం చేయడం అంత ఈజీ కాదు. ఇప్పటికే మీరు మీరు బ్యూటీషియన్ కోర్సు చేస్తే..ఇంట్లో నుంచే ఈ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ మొదట ప్రారంభించి..లాభాలు వచ్చినా కొద్ది బిజినెస్ ను డెవలప్ చేసుకోవచ్చు. ఇంట్లో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తే చాలా బెనిఫిట్స్ఉంటాయి. అద్దె కట్టాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కాబట్టి మహిళలకు అంతగా ఇబ్బందులు ఉండవు. మీ చుట్టు పక్కలవారికి దగ్గరగా ఉంటారు కాబట్టి మరింత సులభంగా ఉంటుంది. ఒకవేళ ఈ బిజినెస్ షాపు ద్వారా ప్రారంభించాలనుకుంటే రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతం చూసి షాపు ఓపెన్ చేయాలి.

బ్యూటీ పార్లర్ రిజిస్ట్రేషన్:
ఇక జీఎస్టీ కోసం మీ బ్యూటీ పార్లర్ లాభాలు పెరిగినప్పుడు తప్పకుండా చేసుకోవల్సి ఉంటుంది. ఇంట్లోనే పార్లర్ ఉంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. షాపు అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే. మీరుషాపు ఈ వ్యాపారం ప్రారంభిస్తే రెండు విధాల సంపాదించవచ్చు. ఒకటి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు. రెండు మీరు కూడా ట్రైనింగ్ ఇవ్వవచ్చు. బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మవచ్చు. బ్యూటీ థెరఫీ కూడా చేయవచ్చు. గోరింటాకు పెట్టడం నేర్చుకున్నట్లయితే పెళ్లిలకు, ఫంక్షన్లకు పెట్టడం ద్వారా మీరు అదనంగా డబ్బు సంపాదించవచ్చు.

ఖర్చు.
ఈ వ్యాపారాన్ని మీరు ఇంట్లో నుంచి ప్రారంబించాలనుకుంటే కేవలం 15వేల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. పార్లర్ కు అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెద్దెత్తున పెట్టాలనుకుంటే మాత్రం లక్షల నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

లాభాలు:
లాభాలు అనేవి మీ పని విధానంపై ఆధారపడి ఉంటాయి. మీరు వినియోగదారులకు నచ్చేలా ఉంటే ఆటోమెటిగ్గా వారు మీదగ్గరికి వస్తారు. వచ్చిన వారితో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని వదులుకోరు. అంతేకాదు కస్టమర్ల ఇంటికి వెళ్లి సేవలందించడం ద్వారా మీరు మరింత సంపాదించవచ్చు.