Site icon HashtagU Telugu

5000 Shooters : లారెన్స్‌ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్

Salman Bhai Lawrence Bishnoi

5000 Shooters : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి వరుస వార్నింగ్‌లు వస్తున్నాయి. కృష్ణజింకలను వేటాడినందుకు బిష్ణోయి వర్గం ప్రజలకు సారీ చెప్పాలని జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయి పదేపదే డిమాండ్ చేస్తున్నాడు. సారీ చెబితే.. సల్మాన్‌ను ఏమీ చేయకుండా వదిలేస్తానని అతడు అంటున్నాడు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.  ఒకవేళ సల్మాన్ ఖాన్‌కు ఏదైనా జరిగితే.. లారెన్స్ బిష్ణోయిని చంపడానికి 5000 మంది షూటర్లు రెడీగా ఉన్నారని అతగాడు సంచలన కామెంట్ చేశాడు. మరణం నుంచి లారెన్స్ తప్పించుకోలేడని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :Actress Suhasini : సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు : సుహాసిని

లారెన్స్ బిష్ణోయి ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో(5000 Shooters) ఉన్నాడు. అక్కడి నుంచే అతడు దేశవ్యాప్తంగా షూటర్ల నెట్‌వర్క్‌ను నడుపుతూ హత్యలు చేయిస్తుంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే  అక్టోబర్ 12న రాత్రి ముంబైలో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్దిఖీని లారెన్స్ మర్డర్ చేయించాడని అంటున్నారు. లారెన్స్ నెక్ట్స్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అయి ఉండొచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచారు. లారెన్స్ బిష్ణోయిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read :Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం విషమం.. వారసుడిగా ముజ్తబా ఖమేనీ ?

ఇటీవలే ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌‌కు లారెన్స్ బిష్ణోయి పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు పంపాడు. అతడి లొకేషన్‌ను ట్రాక్ చేసి పోలీసులు అరెస్టు చేశారు. ‘‘రూ.5 కోట్లు ఇస్తే సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ వదిలేస్తాడు’’ అని సదరు యువకుడు వార్నింగ్ మెసేజ్‌లో ప్రస్తావించాడు. అతగాడికి లారెన్స్ గ్యాంగుతో సంబంధం ఉందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.