Site icon HashtagU Telugu

MK Stalin : మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలం..స్టాలిన్‌

If Modi is Prime Minister again, the whole country will be in chaos with riots..MK Stalin

If Modi is Prime Minister again, the whole country will be in chaos with riots..MK Stalin

 

MK Stalin : ప్రధాని నరేంద్రమోడీ(PM Modi)పై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కామెంట్స్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన ఆయన.. పార్టీ అభ్యర్థుల కోసం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. తన పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.

ఇవాళ (మంగళవారం) ఉదయం తూత్తుకుడి (Thoothukudi) జిల్లాలో స్టాలిన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సోదరి, ఎంపీ కనిమొళి (Kanimozhi) తో కలిసి తూత్తుకుడిలోని కూరగాయల మార్కెట్‌లో, మత్స్యకారుల కాలనీలో ఆయన ప్రచారం చేశారు. స్థానికులు సీఎంతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీపై స్టాలిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావద్దని వ్యాఖ్యానించారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలంగా మారుతుందని ఓట్లర్లను హెచ్చరించారు. మోడీని మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమనేది తమిళనాడు ప్రజల చేతుల్లో ఉందన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే సమాజంలో విష బీజాలు నాటుతదని విమర్శించారు.

Read Also:  Kavitha : తిహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌