Kotak Kanya Scholarship: ఇంటర్‌లో 75 శాతానికి మించి మార్కులతో పాసైన విద్యార్థినులకు రూ.1.5 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ డబ్బును విద్యార్థినులు ల్యాప్టాప్, హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల కోసం వాడుకోవచ్చు. ఇంతకీ ఈ స్కాలర్‌షిప్ ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
మన దేశంలోని పేద విద్యార్థినుల ఉన్నత విద్య కోసం “కోటక్ కన్య స్కాలర్‌షిప్”(Kotak Kanya Scholarship) స్కీంను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యే ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.1.5 లక్షలు మేర ఆర్థిక సహాయం అందుతుంది. విద్యార్థిని తదుపరి కోర్సును పూర్తిచేసే దాకా ఏటా స్కాలర్‌షిప్ డబ్బులు వస్తూనే ఉంటాయి. అయితే కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉన్నవారే అప్లై చేయాలి. మన దేశంలోని NIRF/NAAC సంస్థల గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ, బీ ఫార్మసీ, బీఎస్సీ వంటి గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరిన విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయొచ్చు. అయితే కోటక్ మహీంద్రా గ్రూప్, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, బడ్డీ ఫర్ స్టడీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు అర్హులు కాదు. ఈసారి దరఖాస్తులు సమర్పించాల్సిన లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30.
Also Read :WhatsApp Blue Badge: వాట్సాప్ లో ఇది గమనించారా.. మారిన వెరిఫికేషన్ బ్యాడ్జ్ కలర్!
ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసే వారు దరఖాస్తుతో పాటు ఇంటర్ మార్క్షీట్, తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికెట్, ప్రస్తుతం చదువుతున్న కోర్సు ఫీజు వివరాలు, బోనఫైడ్ సర్టిఫికెట్, కాలేజీ సీట్ అలాట్మెంట్ లెటర్, ప్రవేశ పరీక్ష స్కోర్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జతపర్చాలి. వీటితోపాటు వైకల్యం ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్, తల్లి లేదా తండ్రి మరణిస్తే దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్, ఇంటి ఫొటోలను సమర్పించాలి. వాటన్నింటిని తనిఖీ చేసి అన్ని అర్హతలు ఉన్నాయని భావిస్తే స్కాలర్‌షిప్‌ను మంజూరు చేస్తారు. https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship#scholarships అనే వెబ్‌సైట్ ద్వారా దీనికి అప్లై చేయొచ్చు.