Site icon HashtagU Telugu

PM Modi : సీఎం నవీన్​ పట్నాయక్​ ఆరోగ్య క్షీణతపై దర్యాప్తు : ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన హామీ ఇచ్చారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించిన అంశంపై ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. నవీన్​ పట్నాయక్​ సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన వీకే పాండియన్​ను పరోక్షంగా ఉద్దేశిస్తూ  ప్రధాని ఈ కామెంట్ చేశారు. ‘‘ప్రస్తుతం నవీన్​ పట్నాయక్ సన్నిహితులంతా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కాలంలో ఆయన ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో చూసి బాధపడుతున్నారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్య క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఏదైనా కుట్ర జరిగిందా? ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన వాళ్లే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు జరగాలి’’ అని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తేనే ఈ దర్యాప్తు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒడిశాలోని మయూర్​భంజ్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఈ కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారుపై ప్రధాని మోడీ(PM Modi) నిప్పులు చెరిగారు. ఓబీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడవడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లను దీదీ కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లను కోల్‌కతా హైకోర్టు రద్దు చేసినా.. వాస్తవాన్ని అంగీకరించేందుకు  మమతా బెనర్జీ సర్కారు సిద్ధంగా లేదన్నారు. బెంగాల్‌లోని కక్‌ద్వీప్‌ బహిరంగసభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. నకిలీ కులధ్రువపత్రాలను ఇవ్వడం ద్వారా ముస్లింలను మమతా బెనర్జీ మభ్యపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read :1200 Phones Tapped: 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేశాం.. ప్రణీత్‌రావు వాంగ్మూలం

‘‘బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా లెక్కలు మారిపోవటంపై దేశమంతా చింతిస్తోంది. ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. హిందూ శరణార్థులు, మథువా శరణార్థులను బెంగాల్‌లో ఉండనివ్వకూడదని టీఎంసీ అనుకుంటోంది. కానీ హిందూ శరణార్థులు చింతించాల్సిన అవసరం లేదు. జూన్‌ 4 తర్వాత టీఎంసీ పనైపోతుంది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Also Read : Israels Isolation : ఏకాకిగా ఇజ్రాయెల్.. రఫాలో నరమేధంపై ఏకమైన ప్రపంచం