Site icon HashtagU Telugu

Bank Jobs : డిగ్రీ చేశారా.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు జాబ్స్

Bank Jobs

Bank Jobs

Bank Jobs : బ్యాంకు జాబ్స్‌కు భలే క్రేజ్ ఉంది. చాలామంది యువత బ్యాంకులో జాబ్ సంపాదించాలనే డ్రీమ్‌తో  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారు.  అలాంటి వారికి ఐబీపీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా జూన్ 6న ఓ జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఆఫీసర్​ (స్కేల్‌- I, II, III), ఆఫీస్‌ అసిస్టెంట్​ (మల్టీపర్పస్‌)/ క్లర్క్​ పోస్టులను భర్తీ చేస్తామని అనౌన్స్ చేసింది. వీటికి ఎంపికయ్యే వారు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లలో ఈ జాబ్స్ ఉంటాయి. https://www.ibps.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.

We’re now on WhatsApp. Click to Join

ఈ జాబ్స్‌కు అప్లై చేసే ముందు మనం వయోపరిమితి గురించి తెలుసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్లలోపు  ఉండాలి. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్లలోపు ఉండాలి. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి.

Also Read :TV Channels : టీవీ ఛానళ్ల రేట్లకు రెక్కలు.. సామాన్యుల జేబుకు మరో చిల్లు

పోస్టులను బట్టి అభ్యర్థులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. కాగా,  దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ జూన్ 27.  అభ్యర్థులకు ప్రిలిమిన‌రీ పరీక్ష ఆగస్టు  3, 4, 10, 17, 18 తేదీల్లో ఉంటుంది. మెయిన్స్​ పరీక్ష సెప్టెంబర్​ 29, 06 తేదీల్లో ఉంటుంది.  వీటిలో క్వాలిఫై అయ్యే వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని ఉద్యోగాలకు(Bank Jobs) ఎంపిక చేస్తారు.

Also Read : Re KYC : బ్యాంకు అకౌంటుకు రీ కేవైసీ చేసుకోవాలా ? చాలా ఈజీ