IAS Puja Khedkar : వివాదాస్పదంగా మారిన మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు(IAS Puja Khedkar) సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె కుటుంబం పరారీలో ఉంది. తుపాకీని చూపిస్తూ రైతును బెదిరించిన వ్యవహారంలో పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఏడుగురిపై కేసు(FIR) నమోదైంది.
We’re now on WhatsApp. Click to Join
‘‘పూజా ఖేడ్కర్ పేరెంట్స్ పరారీలో ఉన్నారు. వాళ్లు ఇంట్లో లేరు. ప్రస్తుతం వారిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి’’ అని పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. వారి ఆచూకీ కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయని వెల్లడించారు. పూణే సహా సమీపంలోని ఫాంహౌజ్ లు, నివాసాల్లో వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నాక అసలు విషయాలు తెలుస్తాయన్నారు. విచారణ జరిపాక తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read :NCC Special Entry : ఎన్‌సీసీ చేసిన వారికి జాబ్స్.. ట్రైనింగ్‌లో ప్రతినెలా రూ.56వేలు
ఒక రైతును తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో పూజా తల్లిదండ్రులు దిలీప్, మనోరమ సహా ఏడుగురిపై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని 323, 504, 506, 143, 144, 147, 148, 149 సెక్షన్ల కింద ఈ కేసు పెట్టారు. పూణేలో ఉన్న ముల్షి తాలూకాలో కొంత మంది రైతుల్ని గన్‌తో మనోరమ ఖేడ్కర్ బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని 2023 జూన్‌లో రికార్డు చేశారు. ఆత్మరక్షణ కోసమే మనోరమ తుపాకీని వాడారని పూజ కుటుంబసభ్యుల తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. మనోరమ దగ్గరున్న గన్‌కు లైసెన్సు ఉందన్నారు.
Also Read :Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్‌కి త్రివిక్రమ్.. ఆర్ట్ డైరెక్టర్ కూడా.. ఎందుకు..?
ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తన ఆడి కారుతో 21 సార్లు ట్రాఫిక్స్ నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో ఆమెపై రూ.27వేలు జరిమానాను విధించారు. ఈమేరకు ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పూజ తన ప్రైవేట్ వాహనం ముందు,వెనుక భాగంలో ‘మహారాష్ట్ర గవర్నమెంట్’ స్కిక్కర్లు అంటించుకున్నారు. రెడ్ బీకన్ లైట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. పూజ అనేక సార్లు ట్రాఫిక్‌ను ఉల్లంఘించినా పూణే పోలీసులు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.