Site icon HashtagU Telugu

Bridge Collapsed:గాలి వీచింది..బ్రిడ్జి కూలింది…ఐఏఎస్ అధికారి వివరణతో ఖంగుతున్న కేంద్రమంత్రి..!!

Diesel Vehicles

Gadkari

బీహార్ లో గంగానదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జీ ఇటీవల కూలింది. ఈ ఘటనపై స్థానిక ఐఏఎస్ అధికారి వివరణ ఇచ్చారు. ఆ అధికారి వివరణ విని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కంగుతిన్నారు. ఇంతకీ ఆ అధికారి ఏమని వివరణ ఇచ్చారంటే…బలమైన గాలులు వీయడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్టుపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ…బలమైన గాలులు వీస్తే…బ్రిడ్జ్ ఎలా కూలుతుందో అర్థం కావడం లేదన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గడ్కరీ ఈ విషయాన్ని తెలిపారు.

బీహార్ లో ఏప్రిల్ 29న ఓ బ్రిడ్జ్ కూలిందని…దానిపై సెక్రటరీని వివరణ కోరడంతో ఆయన ఈ సమాధానం చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఓ ఐఏఎస్ అధికారి ఇలాంటివి ఎలా నమ్ముతారో అర్థం కావడంలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గట్టిగా గాలి విస్తే బ్రిడ్జి కూలుతుందా…ఏదో తప్పు జరిగిందంటూ మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. నాణ్యత లోపం లేకుండా తక్కువ ఖర్చుతో మన్నికైన నిర్మాణాలను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 1710కోట్ల ఖర్చుతో ఆ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు సమాచారం.