Chopper Crash: ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌ ప్ర‌మాదంపై 15 రోజుల్లో పూర్తికానున్న ద‌ర్యాప్తు

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు మ‌రో 13 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న ఎంఐ17 హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. ఈ ద‌ర్యాప్తు వ‌చ్చే 15 రోజుల్లో పూర్తికానున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

  • Written By:
  • Publish Date - December 17, 2021 / 09:48 AM IST

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు మ‌రో 13 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న ఎంఐ17 హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. ఈ ద‌ర్యాప్తు వ‌చ్చే 15 రోజుల్లో పూర్తికానున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుత విచార‌ణ ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలోని సాక్షుల వాగ్మూలాల‌ను న‌మోదు చేసే ద‌శ‌లో ఉంది.విచార‌ణ బృందం ద‌ర్యాప్తుకు సంబంధించిన ఇత‌ర ఆధారాల‌ను ప‌రిశీలోస్తోంది.

డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్‌లో హెలికాప్టర్‌ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విచారణకు ఆదేశించారు. ఆర్మీ సదరన్ కమాండ్‌కు చెందిన బ్రిగేడియర్, ఏవియేషన్ బ్రాంచ్‌కు చెందిన నేవీ కమోడోర్‌తో పాటు భారత అత్యున్నత ఛాపర్ పైలట్ ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ విచారణకు నేతృత్వం వహిస్తున్నారు. భారత వైమానిక దళ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి దర్యాప్తును నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మ‌రోవైపు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి ఈ కేసులో పరిణామాలపై ఎప్పటికప్పుడు స‌మీక్ష చేస్తున్నారు. దేశంలోని అత్యున్నత సైనిక అధికారిగా, ఎక్కువ కాలం పాటు ఫోర్ స్టార్ జనరల్‌గా పనిచేసిన జనరల్ రావత్ ప్రాణాలు కోల్పోయిన క్రాష్‌కు కారణాలను తెలుసుకోవడానికి ఇండియ‌ణ్ ఎయిర్ ఫోర్స్‌ తీవ్రంగా కృషి చేస్తోంది.