I-T Returns: ఈ ఏడాది కోటి రూపాయల కంటే ఎక్కువ పన్ను చెల్లించిన చెల్లింపుదారుల సంఖ్య ఎంతంటే..?

దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను దాఖలు (I-T Returns)కు గడువు 31 జూలై 2023న పూర్తయింది.

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 09:09 AM IST

I-T Returns: దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను దాఖలు (I-T Returns)కు గడువు 31 జూలై 2023న పూర్తయింది. దానికి సంబంధించిన డేటా నుండి ఇప్పుడు అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరిగిందని ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ డేటా వెల్లడించింది.

కోటి రూపాయల కంటే ఎక్కువ పన్ను చెల్లించిన చెల్లింపుదారుల సంఖ్య ఎంత..?

ఆంగ్ల వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసినవారిలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.69 లక్షలు. కోవిడ్ సంక్షోభానికి ముందు 2018-19 సంవత్సరంతో పోలిస్తే ఇది 49.4 శాతం ఎక్కువ. ఈ విధంగా గత 4 ఏళ్లలో అధికారికంగా రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరగడం దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడానికి సంకేతంగా భావించవచ్చు.

రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల డేటా

ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.69 లక్షలు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.93 లక్షలు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.80 లక్షలుగా ఉంది. 2019-20 సంవత్సరంతో పోలిస్తే కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించే పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పరిశీలిస్తే అందులో 41.5 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు ఈ కాలంతో పోలిస్తే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 0.6 శాతం మాత్రమే పెరిగింది.

Also Read: Rail Fares: మోదీ ప్రభుత్వం రైలు ఛార్జీలను పెంచునుందా..? ఛార్జీల పెంపుపై స్పందించిన రైల్వే మంత్రి..!

5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 1.4 శాతం పెరిగారు

అదేవిధంగా రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.4 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పన్ను పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు.

ఈ ఏడాది పన్ను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య

– ఒక్కో పన్ను శ్లాబులో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పరిశీలిస్తే 4.65 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని చూపారు. అంటే జీరో పన్ను చెల్లించారు.

– రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పన్ను పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు.

– 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 45 లక్షలు.

– 20 నుంచి 50 లక్షల మధ్య పన్ను చెల్లింపుదారుల సంఖ్య 19 లక్షలు.

– 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.3 లక్షలు.

– కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.69 లక్షలు.