Site icon HashtagU Telugu

‘I am ready to resign’ : సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన మమతా బెనర్జీ

Mamatha Neet

Mamatha Neet

‘I am ready to resign’- Mamata : పశ్చిమ బెంగాల్ సీఎం (Chief Minister of West Bengal) మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవి(CM Post)కి రాజీనామా చేసేందుకు సిద్ధమని .. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కోల్ కతా హత్యాచార ఘటన గత కొద్దీ రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైద్య బృందాలు , జూనియర్ డాక్టర్స్ ఇలా ప్రతి ఒక్కరు ఆందోళనలు చేస్తూ..మమతా సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు చర్చలకు సీఎం ఆహ్వానించారు. అయితే ఈ చర్చలకు వైద్య బృందాలు (RG Kar Medical College ) రాలేదు. ఇప్పటికి పలుమార్లు ఆహ్వానాలు అందించిన రాకపోయేసరికి..మమతా కీలక వ్యాఖ్యలు చేసారు.

న్యాయం కోసం (I want justice) రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని ..సీఎం పదవిపై తనకు ఆందోళన లేదని.. ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. మూడు రోజులుగా డాక్టర్లు ప్రభుత్వంతో చర్చలకు హాజరు కావడం లేదు. ఈ చర్చలను ప్రత్యక్షప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ల సమ్మెతో 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 27 మంది మృతి చెందారని వివరించారు. డాక్టర్లతో సమావేశం కోసం నిన్న రెండు గంటల పాటు ఎదురుచూశానని మమతా బెనర్జీ వెల్లడించారు. డాక్టర్లతో చర్చలకు ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించానని తెలిపారు.

హత్యాచార కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని మమతా పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లతో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని స్పష్టం చేశారు. భేటీపై వీడియో రికార్డింగ్ కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతితో ఫుటేజిని డాక్టర్లకు అందజేస్తామని అన్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Read Also : Pithapuram : పవన్ కళ్యాణ్ అడ్డాలోకి జగన్..