Site icon HashtagU Telugu

Air Hostess Video: ఐ యామ్ నాట్ యువర్ సర్వెంట్.. ఎయిర్ హోస్టెస్ వీడియో వైరల్!

Air Hostess video indigo

Air Hostes

విమాన (Flight) ప్రయాణాల్లో అప్పుడప్పుడు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. తోటి ప్రయాణికులు గొడవ పడటం, ఫుడ్, ఇతర విషయాల్లోనూ చిన్న చిన్న కంప్లైట్ ఇవ్వడం లాంటి జరుగుతుంటాయి. తాజాగా డిసెంబరు 16న ఢిల్లీ (Delhi) నుంచి ఇస్తాంబుల్‌కి వెళ్లే ఇండిగో (Indigo) విమానంలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని ఉద్దేశించి ‘‘నేను నీ సర్వెంట్ ను కాను’ అని చెప్పిన ఎయిర్ హోస్టెస్ (Air Hostess) వీడియో వైరల్ అవుతోంది. క్యాబిన్ సిబ్బంది తాను ఆర్డర్ చేసిన వాటిని మాత్రమే అందించగలమని, మీ  కారణంగా సిబ్బంది ఏడుస్తున్నారని ఎయిర్ హోస్టెస్ ఆరోపించింది.

ఎయిర్ హోస్టెస్ (Air Hostess) తనపై ఎందుకు అరుస్తున్నారని ప్రయాణికుడు అడిగినప్పుడు, మీరే మా సిబ్బందిని వేధిస్తున్నారని అని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఎందుకు అరుస్తున్నావని ఎయిర్ హోస్టెస్ ప్రశ్నించగా ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ని (Air Hostess) “నోరు మూసుకో” మండిడ్డాడు. దీంతో ఎయిర్ హోస్టెస్‌ కోపం తో. “క్షమించండి మీరు నాతో అలా మాట్లాడకూడదు. నేను కూడా ఇక్కడ ఉద్యోగిని.  అందరికీ సర్వెంట్ నని, మీకు వ్యక్తిగత సర్వేంట్ మాత్రం కాదు’’ రోదిస్తూ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.