Modi Emotional : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈనేపథ్యంలో రామమందిరంలో 11 రోజుల ప్రత్యేక పూజలను ఇవాళ ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈమేరకు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ శుభ సందర్భానికి సాక్షిగా ఉండడం తన అదృష్టమన్నారు. అయోధ్యలో రామ లల్లా ఆలయ శంకుస్థాపనకు ఇంకా 11 రోజుల సమయమే మిగిలి ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘ఈ మహా గొప్ప కార్యక్రమంలో భారతదేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ప్రభువు శ్రీరాముడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. జనవరి 22న జరగనున్న అయోధ్య రామమందిరం ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక క్రతువును ప్రారంభిస్తున్నాను. ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను. మొదటిసారిగా నేను ఎమోషనల్ అవుతున్నాను. ఇటువంటి పరిస్థితిలో నా భావాలను మాటలలో వ్యక్తీకరించడం చాలా కష్టం. అయినా నేను నా వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Modi Emotional) చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని నరేంద్ర మోదీ తన ఆడియో సందేశంలో ఇలా అన్నారు.. ‘‘ జీవితంలోని కొన్ని క్షణాలు దైవిక ఆశీర్వాదం వల్లే వాస్తవాలుగా మారుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఈరోజు చాలా పవిత్రమైన సందర్భం. ప్రతిచోటా శ్రీరాముని పట్ల అద్భుతమైన భక్తి వాతావరణం నెలకొని ఉంది. దేశంలోని ప్రతి ఒక్కరూ జనవరి 22 కోసం ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి అయోధ్యలో రామ్‌లల్లా దీక్షకు 11 రోజులే మిగిలాయి. నా జీవితంలో మొదటిసారిగా భావోద్వేగాలకు గురవుతున్నాను. నేను భక్తి యొక్క భిన్నమైన అనుభూతిని అనుభవిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ‘‘రామమందిర నిర్మాణం అనేది ఎన్నో తరాలు.. ఎన్నో ఏళ్లుగా రామభక్తులు తమ హృదయాల్లో ఉంచుకున్న కల. అది నెరవేరే సమయంలో నేను అక్కడ ఉండే అవకాశాన్ని పొందుతున్నాను’’ అని తెలిపారు. ‘‘భగవంతుడిని పూజించాలంటే మనలో దైవిక చైతన్యాన్ని మేల్కొల్పాలని మన గ్రంథాలలో చెప్పబడింది. దీని కోసం ఉపవాసం, కఠినమైన నియమాలను పాటించాలి. ఆ ప్రకారం నేను నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక క్రతువును అయోధ్యలో ప్రారంభిస్తున్నాను. ఈ పవిత్ర సందర్భంలో నేను భగవంతుని పాదాలను ప్రార్థిస్తున్నాను’’ అని మోడీ చెప్పారు.
Also Read: Free Electricity : తెలంగాణలో వారికి ఉచిత విద్యుత్ లేనట్టే.. ఎవరికి.. ఎందుకు ?
‘‘అయోధ్యలోని నాసిక్-ధామ్ పంచవటి నుంచి 11 రోజుల పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తుండటం నా అదృష్టం. పంచవటి అనేది రాముడు చాలా కాలం గడిపిన పుణ్యభూమి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి కూడా కావడం నాకు సంతోషకరమైన విషయం. వేల ఏళ్లుగా దాడికి గురవుతున్న భారతదేశ ఆత్మను కదిలించిన మహనీయుడు స్వామి వివేకానంద. నేడు అదే విశ్వాసం రామమందిరం రూపంలో మన గుర్తింపుగా అందరికీ కనిపిస్తుంది’’ అని ప్రధాని మోడీ తన ఆడియో సందేశంలో వివరించారు. ‘‘ఈ రోజు మాతా జీజాబాయి జయంతి. మాతా జీజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో గొప్ప వ్యక్తికి జన్మనిచ్చింది. మాతా జీజాబాయిని స్మరించుకుంటున్నప్పుడు సహజంగానే నాకు మా అమ్మ కూడా గుర్తుకు వస్తుంది. మా అమ్మ తన జీవిత చరమాంకం వరకు జపమాల జపిస్తూ సీత, రామ నామాలను జపిస్తూ ఉండేది. నమో యాప్ ద్వారా ప్రజలు తమ మాటలను, భావాలను నాకు తెలియజేయవచ్చు’’ అని ఆడియో సందేశంలో ప్రధాని మోడీ పేర్కొన్నారు.